అందాల నటి సిమ్రాన్ గారి కుమారులు ఎలా ఉన్నారో మీరే చూడండి,

నటి సిమ్రాన్ ముందుగా తెలుగులో హీరో సుమన్ సరసన నటించిన అబ్బాయి గారి పెళ్లి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సిమ్రాన్, ఆ తరువాత ప్రియా ఓ ప్రియా, మానాన్నకు పెళ్లి, ఆటో డ్రైవర్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి లో హీరోయిన్ గా నటించడం జరిగింది.

అప్పట్లో ఆ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో అక్కడి నుండి సిమ్రాన్ కు తెలుగులో విపరీతంగా అవకాశాలు పెరిగాయి. ఆపై తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ పలు విజయాలు దక్కించుకుంటూ ముందుకు సాగిన సిమ్రాన్, అటు తమిళ్, హిందీ భాషలలో కూడా ఎన్నో సినిమాలు చేసింది. సమరసింహారెడ్డితో పాటు మరొక్కసారి బాలయ్యతో ఆమె చేసిన నరసింహనాయుడు సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో తెలుగులో బాలయ్యతో ఆమె కాంబోకు మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక మొదటి నుండి కూడా మంచి బాడీ షేప్ మెయింటెయిన్ చేస్తూ వచ్చిన సిమ్రాన్, తన అందం, నటనతో పాటు మంచి డ్యాన్స్ లతో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగువెలిగి కుర్రకారు గుండెల్లో గుబులురేపింది. ఇక 2008లో కమెడియన్ కృష్ణభగవాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జాన్ అప్పారావు సిమ్రాన్ కు తెలుగులో ఆఖరి సినిమా.

ఐతే తాజాగా సిమ్రాన్ ఫ్యామిలీలు ఫొటోలను నెట్టింట సందడి చేస్తున్నాయి.ముఖ్యంగా ఆమె పెద్ద కుమారుడు అదిప్ ఓదో ఇప్పుడెల ఉన్నాడో తెలుసా ఫొటో నెటిజన్లకు బాగా ఆకట్టుకుంది. హీరోలకు ఏమాత్రం తీసిపోని అందం, స్టైలిష్ లుక్లో అదిప్ అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. దీంతో అందరి దృష్టి అదిప్ పడింది. హీరోగా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

Leave a Reply