తడిచిన లోదుస్తులు ధరిస్తున్నారా.. మీకు ఈ సమస్యలు రాక తప్పదు..!

వర్షాకాలం అంటే అందరికీ కామన్‌గా ఉండే సమస్య బట్టలు ఆరకపోవడం.. ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే హడావిడి ఒకవైపు.. అటు ఇటుగా ఆరని బట్టలు.. పైన వాటికంటే పర్ఫూమ్‌ కొట్టి మానేజ్ చేస్తారు.. కానీ లోదుస్తులు సరిగ్గా ఆరకున్నా చాలామంది అలానే ధరిస్తారు. సాధారణ దుస్తులకు ఇచ్చే ప్రాధాన్యతను లోదుస్తులకు ఇవ్వరు. అయితే లోదుస్తుల పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా తీసుకోకపోతే పలు రకాల సమస్యలను ఎదుర్కొక తప్పదు.

ఇన్నర్‌వేర్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మహిళలతో పాటు, పురుషుల్లోనూ ప్రైవేట్‌ పార్ట్ ఆరోగ్యం ప్రమాదంలో పడతాయని నిపుణులు అంటున్నారు. గుర్తించాలి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తడిసిన లోదుస్తువులను ఉపయోగించడం వల్ల ఫంగస్‌, అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చికాకు, ఎరుపు దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఇది ఈస్ట్‌ ఇన్ఫెక్షన్ల వంటి ప్రమాదాలకు దారి తీస్తుంది. ఈ సమస్యల కారణంగా…మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. లోదుస్తులను ఎక్కుసేపు ఉపయోగిస్తే.. పీహెచ్‌ వ్యాల్యూస్‌లో మార్పులు రావడం వల్ల ప్రమాదం వాటిల్లుతుంది. ఇక ఎక్కువసేపు వర్కవుట్స్‌, వాకింగ్, జాగింగ్‌ చేసే వారు వర్కవుట్స్‌ చేసిన వెంటనే లోదుస్తులను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

వర్కవుట్స్‌ వల్ల సహజంగానే ప్రైవేట్‌ పార్ట్స్‌ భాగంలో చెమట విపరీతంగా వస్తుంది. అలాగే వదిలేస్తే అది అంటు వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇక ఎక్కువగా చెమట సమస్యతో బాధపడేవారు రోజులో ఒకటి కంటే ఎక్కువసార్లు లోదుస్తులను మార్చాలని సూచిస్తున్నారు.

తడిచిన లోదుస్తులను ఎట్టి పరిస్థిత్తులో ధరించకూడదు. అలాగే మీ సైజుకు కరెక్టుగా సరిపోయేవే వేసుకోవాలి. టైట్‌గా ఉండేవి వేసుకోవడం వల్ల స్కిన్‌ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి. చాలామంది లోదుస్తుల విషయంలో పెద్దగా క్వాలిటీ చూసుకోరు. ఇలా అస్సలు చేయకూడదు. నిజానికి పైన ధరించే బట్టలకంటే..లోదుస్తులే నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. బాడీ షేప్‌ కూడా నీట్‌గా ప్రొజెక్ట్‌ అవుతుంది.

Leave a Reply