స్టార్ హీరో పై నిత్యామీనన్ వైరల్ కామెంట్స్..!

నిత్యామీనన్ స్టార్ గా ఎదిగింది. కళ్ళతోనే అన్ని ఎమోషన్స్ పలికించగల కొద్దిమంది నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు.నిత్యామీనన్ తెలుగులో అలా మొదలైంది, ఇష్క్ గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి, భీమ్లా నాయక్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.అయితే కాస్టింగ్ కౌచ్ కి ఎవరూ అతీతం కాదు అన్నట్లుగా నిత్యా మీనన్ కి కూడా చిత్ర పరిశ్రమలో చేదు అనుభవం ఎదురైందట.

కొన్నేళ్ల క్రితం మీటూ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎదురవుతున్న వేధింపులని నటీమణులు ధైర్యంగా బయట పెడుతున్నారు. సింగర్ చిన్మయి లాంటి వారైతే లైంగిక వేధింపులపై కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా నిత్యామీనన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.

కామాంధులు అన్ని రంగాల్లో ఉంటారని నిత్యామీనన్ తెలిపింది. నాకు టాలీవుడ్ లో ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. నాకు ఇబ్బందులు ఎదురైంది తమిళంలోనే. కోలీవుడ్ కి చెందిన ఒక హీరో నన్ను అసభ్యంగా తాకుతూ షూటింగ్ లో చాలా హింసించాడు.

అతడి పిచ్చి ప్రవర్తన వల్ల షూటింగ్ లో కూడా సరిగ్గా పాల్గొనలేకపోయేదాన్ని. మహిళలని అలా ఇబ్బంది పెడితే ఏ రంగంలో అయిన పనిచేయడం చాలా కష్టం. అందుకే చాలా మంది మహిళలు ఇప్పటికి బయటకి వెళ్లి పని చేయాలంటే భయపడుత్నారు అంటూ నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

దీనితో నిత్యామీనన్ ని అంతలా వేధించిన ఆయా తమిళహీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. తమిళంలో కూడా నిత్యామీనన్ చాలా చిత్రాల్లో నటించింది. నిత్యామీనన్ లాంటి హోమ్లీ హీరోయిన్ నోట ఈ వ్యాఖ్యలు రావడం హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply