వెన్నెల కిషోర్‌ ఇంట్లో కుప్పలుగా 2000నోట్లు.. ఇప్పుడు ఏం చేసుకుంటావు అంటూ కామెంట్స్..!

రెండు వేల రూపాయల నోటును మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఈ నిర్ణయంతో 2023, సెప్టెంబర్ 30వ తేదీ తర్వాత 2 వేల నోటు అనేది చిత్తు కాగితంగా మారనుంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా రెండువేల నోటును చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎవరి ఇంట్లో ఎన్ని రెండువేల నోట్లు బయటకు వస్తాయో అని అంతా ఎదురు చూస్తున్నారు.

అది కాసేపు పక్కన పెడితే టాలీవుడ్లో కొందరు నటీనటులు తెర మీదే కాదు.. బయట కూడా అదిరిపోయే రేంజిలో కామెడీ టైమింగ్‌తో.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి కామెడీ టైమింగ్ ఉన్న వాడే వెన్నెల కిషోర్. అతడికి మంచు విష్ణుతో భలేగా టైమింగ్ కుదురుతూ ఉంటుంది. ‘దేనికైనా రెఢీ’ సహా కొన్ని చిత్రాల్లో వీరి కలయికలో కామెడీ బాగా పండింది. బయట కూడా ఒకరి మీద ఒకరు బాగా పంచులు వేసుకుంటూ ఉంటారు. కిషోర్‌ను సోషల్ మీడియాలో గిల్లుతూ ఉండటం విష్ణుకు అలవాటు.

ఇప్పుడు కిషోర్‌ను మరోసారి సోషల్ మీడియా వేదికగా సరదాగా టార్గెట్ చేశాడు విష్ణు. సంచలనం రేపుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం 2 వేల నోట్లు రద్దు విషయమై కిషోర్ మీద జోక్ పేల్చాడు విష్ణు.రెండు వేల నోట్ల రూపాయలు కుప్పలుగా పోసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నేను శ్రీ వెన్నెల కిషోర్ గారి ఇంటికి వెళ్లినపుడు తీసిన ఫొటో. ఈ నోట్లతో ఆయన ఏం చేసుకుంటాడో అర్థం కావట్లేదు’’ అని విష్ణు ట్వీట్ వేశాడు. కాగా రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ.. సెప్టెంబర్ 30వ తేదీలోపు మాత్రమే ఈ పెద్ద నోటుకు విలువ ఉంటుందని స్పష్టం చేసింది.

Leave a Reply