Ganesh Chaturthi 2023 | వినాయక చవితి రోజు వినాయకుని ఇవి పెడితే చాలు కష్టాలన్నీ తీరిపోతాయి..

వినాయక చవితి

Ganesh Chaturthi 2023 | వినాయక చవితి పండుగ వచ్చేసింది.వినాయక విగ్రహంతో పాటు పూజకు కావాల్సిన సామాగ్రీని కొనుగోలు చేస్తున్నారు. పూజలో 21 రకాల ఆకులను ఉపయోగిస్తుంటారు. ఈ పత్రాలు ప్రధానమైనవి. వాటి విశేషాలు..

  1. మాచీ పత్రం : మాచీ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.
  2. దూర్వా పత్రం : దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డి జాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.
  3. అపామార్గ పత్రం : తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.
  1. బృహతీ పత్రం : దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి.
  2. దుత్తూర పత్రం : దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలుంటాయి.
  3. తులసీ పత్రం : హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ ఆకులను దేవతార్చనలో వాడతారు.
  4. బిల్వ పత్రం : మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు.
  1. బదరీ పత్రం : బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి.
  2. చూత పత్రం : మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగ రోజులలో కనిపించదు.
  3. కరవీర పత్రం : దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.
  4. మరువక పత్రం : దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.
  5. శమీ పత్రం : జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
  6. విష్ణుక్రాంత పత్రం : ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు.
  7. సింధువార పత్రం : సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడ పిలుస్తుంటారు.
  8. అశ్వత్థ పత్రం : రావి ఆకులనే అశ్వత్థ పత్రం అని అంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం సంప్రదాయం.
  9. దాడిమీ పత్రం : అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీ ఫల నైవేద్యం ఎంతో ఇష్టం.
  10. జాజి పత్రం : ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు.
  11. అర్జున పత్రం : మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది.
  12. దేవదారు పత్రం : దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది.
  13. గండలీ పత్రం : దీనినే లతాదూర్వా అని కూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి గడ్డి మాదిరి పెరుగుతుంది.
  14. అర్క పత్రం : జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం ఉంటుందంటారు.

Leave a Reply