World Record | ప్రపంచ రికార్డు సృస్టించిన 4 నెలల చిన్నారి.. ఎలా అంటే..?

allroudadda

World Record | ప్రపంచ రికార్డు సృష్టించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వరల్డ్ రికార్డు సాధించడం కోసం ఏదేమైనా ఒక విషయంపై ఏళ్ల తరబడి సాధన చేసి ప్రపంచంలో ఎవరూ కూడా ఆ పనిని తమల చేయలేరు అన్న విషయాన్ని నిరూపిస్తూ ఉంటారు. ఇలా నిరూపించినప్పుడు మాత్రమే ఇక వరల్డ్ రికార్డులు చోటు సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డు సాధించాలి అనుకునేవారు ఇక ఎన్నో రకాల విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం.

కానీ కొంతమంది మాత్రంరోజూ చేసే పనులనే కాస్త డిఫరెంట్ గా చేసిన కూడా వరల్డ్ రికార్డులు సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి ఒక రికార్డు క్రియేట్ అయింది ఏకంగా నాలుగు నెలల చిన్నారి ప్రపంచ రికార్డును సృష్టించింది.ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతం లోని నందిగామ పట్టణం లో ఒక అద్భుతం జరిగింది. సరిగ్గా నాలుగు నెలలు నిండిన కైవల్య అనే పాప పక్షులు, కూరగాయలు,జంతువులూ ఇలా 120 రకాల ఫోటోలను గుర్తించగలదు అట.

allroudadda
allroudadda

ఇది ఒక అద్భుతమైన ఫీట్ గా పరిగణించి, ప్రపంచ రికార్డు అని నెటిజెన్స్ కొనియాడుతున్నారు. కైవల్య తల్లి హేమ ఇంత చిన్న వయస్సులో తన పాపలో దాగి ఉన్న ఈ ప్రతిభ ని గుర్తించి , ఆ పాపకి సంబంధించిన కొన్ని వీడియోస్ ని రికార్డు చేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్ కి పంపింది. ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. నాలుగు నెలల పాపకి అసలు ఏమి తెలిసి ఉంటుందని ఇవన్నీ గుర్తుపట్టగలిగింది?, అంటే ఆ పాపకి పూర్వ జన్మకి సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా గుర్తు ఉన్నాయా?, అందువల్లనే ఆ పాప ఇంత చిన్న వయస్సులో ఇవన్నీ గుర్తు పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Recent Posts

Leave a Reply