tarak9999 ఎన్టీఆర్‌‌కు వీరాభిమాని మృతిపై తారక్ కన్నీరు..!తక్షణమే దర్యాప్తు జరపాలి

తూర్పు గోదావరికి చెందిన శ్యామ్. ఎన్టీఆర్‌‌కు వీరాభిమాని. ఆయన రెండు రోజుల కిందట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే శ్యామ్ మృతిపై ఎన్టీఆర్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ చావుకు వైసీపే కారణమని టీడీపీ సైతం ఆరోపించింది. శ్యామ్‌ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబసభ్యులు చెప్పడం చర్చనీయంశమైంది.

తాజాగా తన అభిమాని మృతిపై జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ‘శ్యామ్‌ మరణం అత్యంత బాధాకరమైన ఘటన. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు తక్షణమే దర్యాప్తు జరపాలి” అని ఎన్టీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి తమ మంచి మనసు చాటుకున్నారు. చనిపోయిన శ్యామ్ చెల్లెలి బాధ్యతను తీసుకున్నారు. ఎన్టీఆర్ పేరిట ఫ్యాన్స్ నెలకొలిపిన స్వచ్చంద సంస్థ శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత తమదే అంటూ ముందుకు వచ్చింది. శ్యామ్ చెల్లెలి పెళ్లి దగ్గరుండి జరిపిస్తామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు RAW NTR అనే పేరుతో ఓ స్వచ్చంద సంస్థను నెలకొలిపారు . ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయం అందించారు. ఇప్పుడు శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యతను స్వీకరించారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. కానీ, శ్యామ్ కుటుంబానికి మేము అండగా నిలుస్తాం..శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మేము తీసుకున్నాం అని తెలిపారు.

Leave a Reply