ఒకప్పుడు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ… పాపం అవకాశాల్లేక…

ఒక్కోసారి సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో నటించి ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొంతమంది హీరోయిన్లు కెరీర్ పరంగా పెద్దగా నిలదొక్కుకోలేక పోతుంటారు.అయితే ఇందులో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “ఆది” సినిమాలో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ముంబై బ్యూటీ కీర్తి చావ్లా ఒకరు.

అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నప్పటికీ తన తదుపరి చిత్రం కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో హీరోయిన్ గా రాణించలేక పోయింది.

అయితే కీర్తి చావ్లా అందం, అభినయం, నటనా ప్రతిభ మెండుగా ఉన్నప్పటికీ వాటిని నిరూపించుకునే అవకాశం దక్కలేదని కూడా చెప్పాలి.ఒక రకంగా చెప్పాలంటే కీర్తి చావ్లా స్టార్ హీరోయిన్ కాకపోవడానికి ఇది కూడా ఒక కారణం.దీనికితోడు అప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.

దీంతో కీర్తి చావ్లా సినిమాలపై పెద్దగా దృష్టి సాధించలేకపోయింది.కానీ అప్పుడప్పుడు అడపాదడపా పాత్రలో మాత్రం నటించింది.అయితే తెలుగులో కీర్తి చావ్లా ఎన్టీఆర్ తో కలిసి నటించిన “ఆది” చిత్రం తప్ప ఇతర చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దీంతో తెలుగులో చివరగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహించిన “బ్రోకర్” అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.

కానీ ఈ చిత్రం కూడా ఈ అమ్మడికి బ్రేక్ ఇవ్వలేకపోయింది.దీంతో మళ్లీ అప్పటినుంచి కీర్తి చావ్లా తెలుగులో నటించలేదు.తాజా సమాచారం ప్రకారం కీర్తి చావ్లా ముంబైలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ అమ్మడు ప్రస్తుతం వ్యాపారాలపై దృష్టి సారించినట్లు సమాచారం.

Leave a Reply