Aarthi Agarwal | పాపం అందుకే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ మరణించిందట…

allroudadda

Aarthi Agarwal | తెలుగులో ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వు నాకు నచ్చావ్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ కి హీరోయిన్ గా పరిచయమైన స్వర్గీయ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె తెలుగులో దాదాపుగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.అయితే ఒకప్పుడు చేతినిండా వరుస అవకాశాలతో బాగా రాణించినటువంటి నటి ఆర్తి అగర్వాల్ అనుకోకుండా మరణించింది.

అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆర్తి అగర్వాల్ మరణించడానికి గల కారణాలు హల్ చల్ చేస్తున్నాయి.అయితే ఇందులో ముఖ్యంగా ఒకప్పుడు ఆర్తి అగర్వాల్ వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతున్న సమయంలో అనుకోకుండా కొంతమేర బరువు పెరిగింది.ఈ కారణంగా క్రమక్రమంగా ఆర్తి అగర్వాల్ కి సినీ అవకాశాలు తగ్గిపోయాయి.దాంతో ఆర్తి అగర్వాల్ తీవ్ర మనస్తాపానికి గురైంది.దీంతో ఎలాగైనా సరే బరువు తగ్గాలని వర్కౌట్లు మరియు బరువు తగ్గేందుకు చేయించుకునే లైపోసక్షన్ ఆపరేషన్ ని కూడా చేయించుకుంది.

allroudadda
allroudadda

అయితే ఈ ఆపరేషన్ వికటించి గుండెపోటు రావడంతో ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెందింది.ఒకప్పుడు స్వర్గీయ నటి ఆర్తి అగర్వాల్ నటించిన వసంతం, ఇంద్ర, నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, వీడే, అడవి రాముడు తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాయి.కాగా తెలుగులో ఆర్తి అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, రాజశేఖర్ , తరుణ్, స్వర్గీయ హీరో ఉదయ్ కిరణ్ తదితర హీరోలతో కలిసి నటించింది.ఏదేమైనప్పటికీ ఎంతో సినిమా భవిష్యత్తు ఉన్నటువంటి ఓ హీరోయిన్ ఇలా గుండెపోటు కారణంగా అకాల మరణం చెందడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.

Recent Posts

Leave a Reply