తండ్రి ముందే వరికోత మిషన్‌లో పడి కొడుకు కన్నుమూత..!

బ్బాపూర్‌ గ్రామానికి చెందిన చెవుల ప్రభాకర్‌, విజయం దంపతులకు కొడుకు చెవుల రంజిత్‌ (17) తోపాటు ఒక కుమార్తె ఉన్నారు. ప్రభాకర్‌ గ్రామంలో డిష్‌ ఆపరేటర్‌గా పనిచేయడంతోపాటు ఓ హార్వెస్టర్‌ మిషన్‌ను కొనుగోలు చేసి వరికోతలకు కూడా వెళ్తున్నాడు. ఇటీవల అతని కొడుకు రంజిత్‌ ఇంటర్‌ పూర్తిచేశాడు. ఉన్నత తరగతుల్లో చేరేందుకు సమయం ఉండటంతో ఇంటిపట్టునే ఉంటూ తండ్రికి అన్ని పనుల్లో సహకరిస్తున్నాడు.

ఈ క్రమంలోనే శనివారం తండ్రితో కలిసి తమ సొంత పొలంలో వరికోసేందుకు వెళ్లాడు.తండ్రి మిషన్‌తో వరికోస్తుంటే రంజిత్‌ ఆ మిషన్‌లో ఇరుక్కున్న మట్టిని, చెత్తను తొలగిస్తూ సహకరిస్తున్నాడు. ఆ రోజు చీకటిపడే వరకు వరి కోసినా పూర్తి కాకపోవడంతో ఇంటికి వెళ్లి ఆదివారం ఉదయాన్నే మళ్లీ పొలానికి చేరుకున్నారు.

ప్రభావకర్‌ మిగిలిన వరిని కోస్తూ మిషన్‌లో ఇరుక్కున్న మట్టిని తొలగించమని కొడుకు రంజిత్‌కు ఎప్పటిలాగే పని పురమాయించాడు. అయితే రంజిత్‌ మట్టిని తొలగిస్తుండగానే ప్రభాకర్‌ పొరపాటున బ్లేడ్‌ను రన్‌ చేశాడు. అంతే క్షణాల్లో రంజిత్‌ మిషన్‌లో పడి నడుము వరకు ఇరుక్కుపోయాడు.కన్నతండ్రి చేసిన పొరపాటుకు ఆయన కళ్లముందే చెట్టంత కొడుకు ఒళ్లంతా రక్తమోడుతూ విలవిల్లాడాడు.అది చూసిన తండ్రి గుండెలు పగిలేల ఏడ్చడు.. అది చూసి గ్రామం మొత్తం విలవిలలాడింది..

Leave a Reply