ఐసీయూలో నటుడు అబ్బాస్.. కన్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్!

ప్రేమ దేశం. 1996లో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే ప్రేక్షకులకు పరిచయమైన నటుడు అబ్బాస్.ఎక్కడో పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన ఈయన తెలుగు, తమిళ సినిమాలతో ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 50 సినిమాలకు పైగా నటించిన అబ్బాస్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే పదేళ్లకు పైగానే అయ్యుంటుంది ఆయన రెగ్యులర్ గా సినిమాలు చేసి.

కేవలం 20 ఏళ్ళ వయసులో హీరోగా అడుగుపెట్టిన ఈయన.. 40 ఏళ్ల లోపు రిటైర్మెంట్ తీసుకున్నాడు.అబ్బాస్ కొన్ని సంవత్సరాలుగా ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది చాలా మందికి కనీసం తెలియదు. సినిమాలు చేయడం లేదు.. మోడలింగ్ కూడా మానేశాడు. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనేది అభిమానులకు సస్పెన్స్. దీనికి సమాధానంగా ఆయన సోషల్ మీడియా పేజీ నిలిచింది.ఈయన ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్నాడు.

కొన్నేళ్ళుగా అక్కడే నివసిస్తున్నాడు.ఇంకా చెప్పాలంటే అబ్బాస్ పూర్తిగా ఇప్పుడు న్యూజిలాండ్ వాసి అయిపోయాడు.ఒకప్పుడు తన హెయిర్ స్టైల్ అందంతో అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా ఆకర్షించాడు అబ్బాస్. చాలా తక్కువ సమయంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేశాడు.. హిందీలో కూడా నటించాడు.

అయితే తాజాగా ఆయన ఆసుపత్రి బెడ్ పైన ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. చేతికి సెలైన్స్, ఆక్సిజన్ ట్యూబ్స్ తో ఐసీయూలో ఉన్న అబ్బాస్ ని చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. ఆయన ఒక సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం… కంగారు పడాల్సిన విషయం ఏమి లేదని తెలుస్తోంది.. కొద్దిరోజుల క్రితం ఆయనకు యాక్సిడెంట్ అయినట్టు దాంతో మోకాలికి గాయమైనట్టు సమాచారం. దీంతో వైద్యులు ఆయనకి తప్పనిసరిగా సర్జరీ చేయాలని సూచించారంట..

Leave a Reply