హీరోయిన్ నగ్మా ఎంతమంది హీరోలతో ప్రేమాయణం నడిపిందో తెలుసా..?

నటి నగ్మా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నగ్మా పేరు చెబితేనే 90ల కాలంలో తెలుగు ప్రేక్షకులు పులకించిపోయేవారు. ఆకట్టుకునే ఆమె అందం.. అంతకుమించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసేది. తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ లతో నటించి మెప్పించింది. తెలుగులో నగ్మా నటించిన ‘కిల్లర్’ ‘అల్లరి అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ ‘వారసుడు’ ‘మేజర్ చంద్రకాంత్’ ‘భాషా’ ‘ప్రేమికుడు’ లాంటి చిత్రాలు అప్పట్లో ఘన విజయం సాధించాయి.

అప్పట్లో అరేబియన్ గుర్రం వంటి నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. తెలుగులో చివరగా ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అల్లరి రాముడు’ సినిమాలో అత్తగా నటించి అలరించింది. సినిమాలతోనే కాకుండా ఎఫైర్ వార్తలతోను నగ్మా ఫేమస్ అయింది.ఇది ఇలా ఉండగా 50 ఏళ్ళ వయసుకి దగ్గర పడుతున్న నగ్మా ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు..దానికి కారణాలు చాలానే ఉన్నాయి..గతం లో ఈమె తమిళ టాప్ హీరో శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపింది..

కానీ ఎందుకో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది..ఇక ఆ తర్వాత భోజ్ పూరి సూపర్ స్టార్ రవి కిషన్ తో చాలా సినిమాలే చేసింది..వీళ్లిద్దరి మధ్య కూడా అప్పట్లో లవ్ ట్రాక్ నడిచింది..కానీ చివరికి ఇది కూడా బ్రేకప్ అయ్యింది..ఇక ఆ తర్వాత మనోజ్ తివారి అనే హీరో తో ఈమె ప్రేమాయణం నడిపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి..కానీ చివరికి ఇది కూడా బ్రేకప్ అయ్యింది..

ఇక ఇండియన్ కెప్టెన్ గంగూలీ తో నగ్మా నడిపిన ప్రేమాయణం సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్ళ పెళ్లి పీటలు వరుకు వచ్చి పెటాకులు అయ్యింది..ఈ సంఘటన తో మనసు పూర్తిగా విరిగిపోయిన నగ్మా ఇక జీవితం లో ప్రేమ మరియు పెళ్ళికి స్థానం ఇవ్వకూడదు అని నిర్ణయించుకుందట..అందుకే ఆమె ఒంటరి జీవితం గడుపుతుంది..ఇక నగ్మా చెల్లి జ్యోతిక సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య ని పెళ్ళాడి సుఖవంతమైన జీవితం ని గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

Leave a Reply