Actress | ఒకప్పుడు సీరియల్స్ లో స్టార్ కానీ ఇప్పుడు అవకాశాలు లేక కాల్ సెంటర్లో జాబ్

allroudadda

Actress | ఆ మధ్య కరోనా ఎఫెక్ట్‌తో ఎంతో మంది ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మ హ* త్యకు పాల్పడ్డారు. మరికొందరు తమకు దొరికిన పనిని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. సీరియల్ నటి ఏక్తా శర్మ (Ekta Sharma) లైఫ్ కూడా కరోనా ఎఫెక్ట్‌తో తలకిందులైంది. అవకాశాలు లేక చివరికి తాను కాల్ సెంటర్‌లో పనిచేసినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

బాలీవుడ్ సీరియల్స్ లో బాగా పాపులర్ అయిన నటి ఏక్తా శర్మ. టీవీ షోలు, సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకుంది ఏక్తా. డాడీ సంఝా కరో, కుసుమ్‌, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, కామినీ-దామిని లాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు అవకాశాలు లేక, పర్సనల్, ఫ్యామిలీ సమస్యలతో సతమతమవుతూ ఓ కాల్ సెంటర్లో జాబ్ చేసుకుంటుంది.ఏక్తా శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

allroudadda
allroudadda

”కరోనా కారణంగా చాలా మంది జీవితాలు మారిపోయాయి. అందులోనే నా జీవితం కూడా తలకిందులయింది. ప్రస్తుతం ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. ఇల్లు గడవడం కూడా కష్టంగా మారడంతో ఉన్న నగలు అన్నీ అమ్మేశాను. అవకాశాలు కూడా రావట్లేదు. అవకాశాలు రావట్లేదని ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేను కదా అందుకే కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నా. ఈ పని చేస్తున్నందుకు నాకేమీ తప్పుగా అనిపించడంలేదు. ప్రస్తుతం కోర్టులో నా కూతురి కస్టడీ కేసు కూడా నడుస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని నేను ఎదురు చూడను. అందుకే ఇలా కాల్ సెంటర్ లో పని చేస్తూనే కుదిరినప్పుడల్లా మళ్ళీ ఆడిషన్స్ ఇస్తున్నాను. నాకు మళ్ళీ అవకాశాలు వస్తాయనే అనుకుంటున్నాను” అని ఎమోషనల్ అయింది.

Recent Posts

Leave a Reply