ఈ పాపను గుర్తుపట్టారా..ఇప్పుడు స్టార్ హీరోయిన్..!

తెలుగు ఇండస్ట్రీలో కి ‘హ్యాపీడేస్’ చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో నటిస్తూ బాగా బిజీగా మారిపోయింది. తమన్నా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది.

2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్, బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి తమన్నాకి సరైన గుర్తింపును ఇచ్చాయి. ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఈ అమ్మడి స్టార్ మార్చంది.

ఈ సినిమాలో అవంతిక పాత్రలో అప్సరసలా కనిపించింది. తమన్నా 21 డిసెంబర్ 1989న ముంబైలో జన్మించింది.తమన్నాది సింధీ కుటుంబం. తన తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజిని భాటియా. తన అన్నయ్య ఆనంద్ భాటియా మెడిసిన్ చదివాడు. చిన్నప్పట్నుంచి హీరోయిన్‌ కావాలనే తమన్నాకి ఉండేది. తమన్నా చిన్న నాటి అపురూప చిత్రం మీకోసం.

Leave a Reply