Gauthami Daughter | నటి గౌతమి కూతురుని చూశారా.. ఆ అందం ఏంట్రా బాబు.

allroudadda

Gauthami Daughter | సీనియర్ నటి గౌతమి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. శ్రీకాకుళంలో జన్మించిన ఆమె సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి మెప్పించారు.. కథానాయికగానే కాకుండా కీలకపాత్రల్లోనూ అలరించారు.. ‘జెంటిల్ మెన్’ మూవీలో ‘చికుబుకు రైలే’ అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.

అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా చక్కని చిరునవ్వుతో కనిపించే గౌతమి 1998 తర్వాత కెరీర్‌కి కాస్త గ్యాప్ ఇచ్చి ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.ఇటీవల ‘ స్టోరీ ఆఫ్ థగ్స్’ అనే తమిళ్ సిరీస్ చేశారు. సమంత ‘శాకుంతలం’ తో పాటు ‘అన్నీ మంచి శకునములే’ లో నటించారు.

allroudadda
gautami talk about subbalakshmi

తాజాగా గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 1998లో సందీప్ భాటియాను పెళ్లాడి 1999లో ఆయనతో విడిపోయారు. వారికి సుబ్బలక్ష్మీ సంతానం.తర్వాత కొన్నాళ్లు కమల్ హాసన్‌తో సహజీవనం చేసి కొద్ది కాలం క్రితం విడిపోయారామె. అయితే గౌతమి కూతురు సుబ్బు చూడముచ్చటగా ఉంది.. హీరోయిన్ లక్షణాలున్నాయి.. కచ్చితంగా మంచి నటి అవుతుంది అంటూ ఆమె పిక్స్, వీడియోస్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు..

Leave a Reply