దాని వల్లే నాకు 10th క్లాస్ లోనే పెళ్లి చేసారు..! జయవాణి

తెలుగు సినిమా పరిశ్రమలోకి రావాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.ఎలాగైనా ఫర్వాలేదు.సినిమా తెర మీద కనపడాలి అనుకుంటారు.ఈ నేపథ్యంలో ఎలాంటి పాత్రలు చేయడానికైనా సరే అంటారు.కొందరు నటీనటులకు చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చినా.చక్కగా వినియోగించుకుంటారు.మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.అలా చిన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణి జయవాణి.

ఈమె తొలుత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సందర్భంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.సినిమా పరిశ్రమలో తను ఎక్కువగా విలన్ క్యారెక్టర్లు చేసింది.
ఫీమేల్ రోల్స్ లో విలన్ పాత్రలు చేసే వారి సంఖ్య తెలుగు సినిమా పరిశ్రమలో చాలా తక్కువ.అయితే తను ఈ పాత్రలో బాగా నటించేది.అయితే ఓకే రకమైన పాత్రలు చేయడం అంటే ఇష్టం ఉండేది కాదని చెప్పింది.అయితే కొందరు దర్శకులు మాత్రం తనకు ఎటువంటి పాత్ర ఇచ్చినా చేయగలనని చెప్పేదట.

కానీ చాలా మంది దర్శకులు బోల్డ్ సీన్లు చేసేందుకే అవకాశం ఇచ్చినట్లు చెప్పింది.అయినా తను నో చెప్పకుండా నటించినట్లు వెల్లడించింది.చిన్న వయసు నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించినట్లు చెప్పింది.చాలా ఇబ్బందులు పడినట్లు వెల్లడించింది.అయినా… తనకు తన తండ్రి సపోర్టు మాత్రం ఉందని వెల్లడించింది.తన తండ్రి సహకారంతోనే సినిమా పరిశ్రమలో రాణిస్తున్నట్లు వెల్లడించింది.ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా ఆమె వెల్లడించింది.

తనకు చిన్నతనం నుంచి సినిమాలంటే మహా పిచ్చి ఉండటం తో తన సొంత మావయ్య అయినా గుమ్మడి చంద్రశేఖర్ రావు కి ఇచ్చి పదవ తరగతిలోనే పెళ్లి చేసారని చెప్పింది జయవాణి.ఇక భర్త సహకారం తో పెళ్లి అయ్యాక కూడా బి.ఏ వరకు చదివినట్టుగా వెల్లడించింది.సినిమాల విషయంలో తను కూడా ఎలాంటి కండీషన్లు పెట్టేవాడు కాదని చెప్పింది.అటు సినిమా పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లో తనకు అవకాశాలు రాలేదని చెప్పింది.నల్లగా ఉండటం మూలంగానే ఛాన్సులు ఇచ్చేందుకు దర్శకులు వెనుకాడారని చెప్పింది.ఆ తర్వాత మేకప్ గురించి తెలుసుకుని.నెమ్మదిగా అవకాశాలు పొందినట్లు చెప్పింది.ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చాలా బిజీగా ఉన్నట్లు వాణి వెల్లడించింది.

Leave a Reply