ఆరునెలలకే భర్తకు విడాకులివ్వనున్న బుల్లితెర నటి మహాలక్ష్మి! క్లారిటీ ఇదిగో

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని అస‌లు వార్త ఏదో న‌కిలీ వార్త ఏదో క‌నిపెట్ట‌డం చాలా క‌ష్టం మారింది. ఇక సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన వార్త‌లు అయితే క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి.ఐతే కోలీవుడ్ బుల్లితెర న‌టి మ‌హాల‌క్ష్మీ, ప్రొడ్యూస‌ర్ రవీంద్ర చంద్రశేఖరన్‌లు 2022 సెప్టెంబ‌ర్ 1న వివాహాం చేసుకున్నారు. అప్ప‌ట్లో వీరి పెళ్లిపై భారీగా ట్రోలింగ్ న‌డిచింది. ఇందుకు కార‌ణం న‌టి చూడ‌డానికి స్లిమ్‌గా అందంగా ఉండ‌గా, రవీంద్ర మాత్రం భారీకాయంతో క‌నిపిస్తుంటాడు.

దీంతో మ‌హాల‌క్ష్మీ డ‌బ్బు కోస‌మే అత‌డిని పెళ్లి చేసుకుంద‌నే విమ‌ర్శ‌లు వినిపించాయి. పైగా వీరిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌గా ఇద్ద‌రికి ఇది రెండో వివాహం కావ‌డం గ‌మ‌నార్హం.ఇక రవీందర్‌ను కూడా బాడీ షేమింగ్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఇవన్నీ పెద్దగా పట్టించుకోలేదీ జంట. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహాలక్ష్మి అప్పుడప్పుడూ భర్తతో కలిసున్న రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసేది. తద్వారా ట్రోలర్ల నోరు మూయించేది.

అయితే మహాలక్ష్మి- రవీందర్ విడిపోతున్నారంటూ ఇటీవల కొన్ని యూట్యూబ్‌ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. అందుకు తగ్గట్లే సోషల్‌ మీడియాలోనూ ఎలాంటి ఫొటోలు షేర్‌ చేసుకోలేదీ జంట. దీంతో విడాకుల వార్తలు నిజమేనని భావించారు చాలామంది. అయితే అలాంటిదేమీ లేదని ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చింది మహాలక్ష్మి. తాజాగా తాజాగా భర్తతో కలిసి దిగిన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఆమె ఓ రొమాంటిక్‌ పోస్ట్‌ పెట్టింది

‘నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఏదయినా చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది. నా మనసు నిండా నువ్వే అమ్ము, ఐ లవ్యూ’ అని తన భర్తపై ప్రేమను ఒలకబోసింది బుల్లితెర నటి. ఈ పోస్టుకు రవీందర్‌ కూడా లవ్యూ అంటూ రొమాంటిక్‌ రిప్లై ఇచ్చాడు. తద్వారా తమ వైవాహిక బంధంపై వస్తోన్నరూమర్లకు చెక్‌ పెట్టేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave a Reply