Pavitra: పవిత్ర లోకేష్ ఒక్కరోజు పారితోషకం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు హీరోయిన్గా సక్సెస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని వెళ్లిపోయి.. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే మరి కొంతమంది హీరోయిన్ కాకుండా.. ఛాన్సులు రాక .. పెళ్లి చేసుకుని వెళ్లి .. మళ్లీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు..

ఇలాంటి వారిలో పవిత్ర లోకేష్ కూడా ఒకరు.. తెలుగులో అనేక చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించి మెప్పించిన ఈమె హీరోయిన్గా పలు చిత్రాలలో నటించింది కానీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.కానీ నరేశ్‌తో ప్రేమ వ్యవహారం తర్వాతే ఈమెకు ఇక్కడ బాగా గుర్తింపు వచ్చింది.గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని నరేశ్‌ బహిరంగంగా ప్రకటించాడు.

ఇక వీరిద్దరు కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ నిన్న(మే 26)విడుదలైన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఎమ్మెస్‌ రాజు. నరేశ్‌ ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు.ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో నటించనందుకుగాను పవిత్ర భారీ రెమ్యునరేషన్‌ పుచ్చుకుందట.

వాస్తవానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకశ్‌ రోజుకు రూ.50 వేలు పారితోషికంగా తీసుకునేదట. అయితే నరేశ్‌ ప్రేమ వ్యవహారంతో పవిత్ర మరింత ఫేమస్‌ అయింది. దీంతో ఆమె తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేసిందట. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదట. ప్రస్తుతం పవిత్రకు వరుస ఆఫర్స్‌ వస్తున్నాయి.

Leave a Reply