Actress Prema | ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా….

allroudadda

Actress Prema | హీరోయిన్ (Actress Prema) ప్రేమ.. ఈ పేరు వినగానే అందరికీ దేవీ సినిమానే గుర్తొస్తుంది. నిజానికి ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం టాలీవుడ్ హీరోయిన్ గానే చూస్తారు. నటించిన రెండో చిత్రంతోనే ఉత్తమనటిగా కన్నడ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. 1995 నుంచి 2009 వరకు కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

ఆ తర్వాత కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన ప్రేమ..మళ్లీ 2017లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2017, 2022లో రెండు చిత్రాల్లో నటించి కన్నడ ప్రేక్షకులను మరోసారి పలకరించారు. ఎంతోకాలంగా తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉంటున్న నటి ప్రేమని సుమన్ టీవీ పలకరించింది. బెంగళూరులో ఉంటున్న ప్రేమ హోమ్ టూర్‌ తో.. ఆమెను మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ప్రస్తుతం ఆ హోమ్ టూర్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

allroudadda
allroudadda

Actress Prema | కమ్ బ్యాక్ ఇస్తే ఒక మంచి క్యారెక్టర్ తో ఇవ్వాలి

ఈ సందర్భంగా హీరోయిన్ ప్రేమ తన కుటుంబం, సోదరి, సోదరుడు అయ్యప్ప గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.అంతేకాకుండా మళ్లీ ఎప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తారు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. “నాకు కూడా తెలుగులో మళ్లీ నటించాలని ఉంది. ఫోన్స్ కూడా వస్తూనే ఉన్నాయి. కానీ.. ఒకటి, రెండ్రోజుల షూట్ ఉంది అని కాల్ చేస్తున్నారు. కమ్ బ్యాక్ ఇస్తే ఒక మంచి క్యారెక్టర్ తో ఇవ్వాలి అనుకుంటున్నా. ఒక మంచి క్యారెక్టర్ దొరికితే నటిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ హోమ్ టూర్ లో మరెన్నో ఆసక్తికర విషయాలను హీరోయిన్ ప్రేమ ప్రేక్షకులతో పంచుకున్నారు.

Leave a Reply