Actress Satya | ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆతప్పు చేస్తారు.. నటి సత్య

allroudadda

Satya | టాలీవుడ్ నటి సత్యకృష్ణన్… గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో సుమారు 60కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది అందాల తార. ఆనంద్, బొమ్మరిల్లు, సామాన్యుడు, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, దూకుడు, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, పిల్ల నువ్వులేని జీవితం, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఆడవాళ్లు మీకు జోహార్లు తదితర హిట్ సినిమాలు సత్యకు మంచి పేరు తీసుకొచ్చాయి.ముఖ్యంగా ఆమె వాయిస్ లో ఉన్న బేస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

కాగా, ఆరంభంలో వరుస పెట్టే సినిమాలు చేసిన ఈ నటి ఇప్పుడు ఆడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తుంది. చివరిగా ఆడవాళ్లు మీకు జోహార్లు, 10th క్లాస్ డైరీస్, అమ్ము అనే సినిమాల్లో మాత్రమే కనిపించిన ఆమె సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు.అయితే తాజాగా సత్య కృష్ణన్ కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చాలా మంది కాస్టింగ్ కౌచ్ విషయంలో అమ్మాయిలకు మద్దతుగా నిలుస్తుంటారు.

Actress Satya | పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణ..

allroudadda
allroudadda

కానీ సత్య మాత్రం ఇండస్ట్రీలో అమ్మాయిలు పరిస్థితులని అర్థం చేసుకుని ఇలాంటి ఒడిదుడుకులని అధికమించాలని అంటున్నారు.సముద్రం అన్నాక ఉప్పు ఉంటుంది.. నీరు కూడా ఉంటాయి. మనం ఎలా ఉండాలి అనేది మన నిర్ణయం అని సత్య కృష్ణన్ అన్నారు. తాను మాత్రం ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నట్లు తెలిపారు. తాను పుట్టి పెరిగింది మొత్తం తెలంగాణ లోనే. కానీ అమ్మా నాన్న మాత్రం గుంటూరు వారు. ఇద్దరూ బ్యాంక్ ఎంప్లాయీస్ అని తెలిపింది.తాను హోటల్ మేనేజ్ మెంట్ చేశానని.. సినిమా రంగం పై ఎలాంటి అవగాహన లేదని పేర్కొంది.

Lasya Nanditha | రోడ్డు ప్రమాదంలో లాస్య మృతి.. షాక్ లో అభిమానులు

ఒకసారి ఆడిషన్స్ కి వెళితే సెలెక్ట్ అయిపోయా. ఆ విధంగా సినిమా ఛాన్స్ వచ్చింది అని తెలిపారు. ఇండస్ట్రీలో తనకి ఎలాంటి కా స్టింగ్ కౌ చ్ అనుభవం ఎదురు కాలేదని సత్య అన్నారు. నన్ను అందరూ చాలా గౌరవిస్తారు. ఎందుకంటే నేను వర్క్ నే ప్రేమిస్తాను కాబట్టి అని సత్య తెలిపింది.కా స్టింగ్ కౌ చ్ గురించి సత్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీ గురించి ప్రస్తావన వస్తే ఇక్కడ ఆడవాళ్ళని వాడేసుకుంటారు అని చెబుతుంటారు. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే సంఘటనలు ఏ ఇండస్ట్రీలో జరగడం లేదు ? కేవలం సినిమా పరిశ్రమలోనే జరుగుతున్నాయా ? అని ప్రశ్నించారు. సముద్రంలో ఉప్పు నీరు రెండూ ఉంటాయి.

Satya | క్యారెక్టర్స్ ఇవ్వరేమోనని కమిటై పోతుంటారు.

allroudadda
allroudadda

అమ్మాయిలు తాము ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి.ఇండస్ట్రీలో కొంతమంది క్యారెక్టర్ లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మన లైన్ లోకి వాళ్ళని రానివ్వకుంటే సరిపోతుంది. కొంతమంది అమ్మాయిలు ముందే భయపడి అది ఇవ్వకపోతే క్యారెక్టర్స్ ఇవ్వరేమోనని కమిటై పోతుంటారు. ఇండస్ట్రీ తప్ప వేరే మార్గం లేదు అనుకోవడం మానాలి. అప్పుడే ఇలాంటి వాటిని అధికమించగలం అని సత్య అన్నారు. కానీ చెప్పడం సులభం.. చాలా మంది అమ్మాయిలకు వాళ్లకి ఉండే సమస్యలు వాళ్ళకి ఉంటాయి. అందువల్ల కా స్టింగ్ కౌ చ్ కి కమిటైపోతుంటారు అని పేర్కొంది.

Recent Posts

Leave a Reply