Sithara| అమ్మో నటి సితార ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనా…?

సితార…మన పక్కింటి అమ్మాయిల ఉండే నటి. ఆమెను చుసిన వారెవరైనా మీలాగే మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉందండి అని చెప్పేవారట అప్పట్లో. ఒక్క ముక్క తెలుగు రాకపోయినా తెలుగు సినిమాల్లో, టెలివిజన్ సీరియల్స్ లో ఒక దశాబ్దం పాటు హవా చాటింది. నిన్నటి తరం చిన్నారులకి ఎండమావులు సీరియల్ అంటే పడి చచ్చిపోతారు. ఇక సితార కేవలం తెలుగులోనే కాదు అటు కన్నడలోను మంచి పేరున్న నటీమణి. ప్రస్తుతం చాల మంది దర్శక నిర్మాతలకి మంచి తల్లి పాత్రలకు మొదటి వరసలో ఉంటుంది సితార.

నవ్వుతు కనిపించే ఆమె మోము వెనకాల ఎన్ని విషాద సంఘటనలు ఉన్నాయ్. అవేంటో ఒకసారి చూద్దాం.నిజానికి సితార మలయాళ కుటుంబంలో పుట్టింది. కానీ తెలుగు, కన్నడ భాషల్లో ఆమెకు మంచి లభించింది. అప్పట్లో కన్నడ సూపర్ హిట్ సినిమాల్లో ఆమెనే హీరోయిన్. ప్రస్తుతం సితార వయసు 46 కానీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. చాల మందికి ఆమెకు పెళ్లి కాలేదు అనే విషయం తెలియకపోవడం విశేషం.

ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె ఓపెన్ అయ్యి చెప్పేవరకు అంత ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి కి దూరం అవ్వడం వెనక రెండు చేదు సంఘటనలు ఉన్నాయి.కేరళలో ని ఒక మలయాళ ఇంట్లో జన్మించిన సితారకు ఆమె తండ్రి అంటే పంచ ప్రాణాలు. ఆమె తండ్రి మేశ్వరన్ నాయర్ లేకుండా సితార ఎలాంటి నిర్ణయం తీసుకునేది కాదు. ప్రతి చిన్న విషయంలోనూ అయన సపోర్ట్ తీసుకునేది.

ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాక కొన్ని రోజులకు అనుకోకుండా ఆయన కన్ను మూసారు. ఆ సంఘటన నుండి సితార కోలుకోలేదు. చాల ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. అలాగే అదే సమయంలో ఆమె తో పాటు నటించిన తమిళ నటుడు మురళితో ఎంతో సన్నిహితంగా ఉండేది. అతడు కూడా గుండెపోటుతో మరణించడం తో పూర్తిగా ఒంటరిగా అయినా సితార పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది. ఇక మురళి తెలుగులో సూపర్ హిట్ సినిమా అయినా హృదయం లో నటించాడు.

Leave a Reply