Tamannah : అలాంటి సన్నివేశాలపై మనసులో మాట చెప్పిన తమన్నా..!

ఇప్పటికీ చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటుంది కానీ చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించింది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. తెలుగులో న‌టించిన తొలి సినిమా శ్రీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మడు ఫుల్లుగా అందాల‌నే న‌మ్ముకుని కెరీర్ లాగేస్తుంది.

కెరీర్ మొద‌లుపెట్టి 15 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతుందంటే దానికి కార‌ణం కూడా అమ్మ‌డి అందాలే.చిన్నా పెద్దా హీరోలు అనే తేడా లేకుండా అంద‌రికీ సామాజిక న్యాయం చేస్తుంది త‌మ‌న్నా. గతేడాది విడుద‌లైన ఎఫ్2 సినిమాలో కూడా ఫుల్లుగా అందాలు ఆర‌బోసింది. ఓ అడుగు ముందుకేసి ఏకంగా bikiనీ కూడా వేసి వేడి పుట్టించింది త‌మ‌న్నా. కానీ తర్వాత సైరాలో పద్దతిగా కనిపించింది.

మళ్లీ విశాల్ యాక్షన్ సినిమాలో బికిne తో వణుకు పుట్టించింది. అలాంటి సీన్స్ చేయ‌డం చేయ‌క‌పోవ‌డం మ‌న యిష్టం అంటుంది త‌మ‌న్నా. ఇక్క‌డ ఎవ‌రూ మిమ్మ‌ల్ని ఆసీన్స్ చేయాల‌ని.. ముద్దులు పెట్టాల‌ని బ‌లవంతం చేయ‌ర‌ని.. అంతా మీ యిష్ట ప్ర‌కార‌మే జ‌రుగుతుందని చెప్పింది ఈ బ్యూటీ.తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌పుడే ముద్దులు పెట్ట‌కూడ‌ద‌ని.. నో కిస్సింగ్ పాల‌సీకి క‌ట్టుబ‌డి వ‌చ్చాన‌ని కుంబ బ‌ద్ద‌లు కొట్టింది త‌మ‌న్నా. కానీ అప్పుడప్పుడు చేయక తప్పడం లేదంటుంది తమన్నా..

Leave a Reply