Sarath Kumar  | 38 ఏళ్ల వయస్సులో సీక్రెట్‌గా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి..

allroudadda

Sarath Kumar | సౌత్ లో స్టార్ నటిగా కొనసాగుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయింది.ఈమె కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో చేసిన సినిమాలు కూడా భారీ హిట్ అయ్యాయి. అలా వీర సింహారెడ్డి,క్రాక్,తెనాలి రామకృష్ణ బీఏ బి ఎల్, యశోద రీసెంట్ గా వచ్చిన హనుమాన్ వంటి మూవీస్ ఈ హీరోయిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అయితే చాలా సంవత్సరాలుగా ఈ హీరోయిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తోంది.ఇక గతంలో కోలీవుడ్ హీరో అయిన విశాల్ ని ప్రేమించి పెళ్లి వరకు వెళ్లినప్పటికీ అది జరగలేదు. కానీ ఎప్పటికైనా వీరిద్దరే పెళ్లి చేసుకుంటారని వార్తలు మీడియాలో వినిపించాయి.కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.గత కొద్ది రోజులుగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి వార్తలు ఎన్నో మీడియాలో వైరల్ అయినప్పటికీ వాటన్నింటినీ ఖండించింది.

allroudadda
allroudadda

తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్‌దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది.నికోలయ్‌.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్‌ గ్యాలరీలు నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదికగా వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాదిలోనే వరలక్ష్మి-నికోలాయి పెళ్లి జరగనుంది. గత 14 ఏళ్ల నుంచి వీళ్లిద్దరికీ పరిచయముంది. అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఏదేమైనా 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి పెళ్లి చేసుకోనుంది.

Recent Posts

Leave a Reply