అలా చేతులారా తప్పు చేశా.. హీరోయిన్ యమున కామెంట్స్..!

హీరోయిన్ యమున తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1987లో యమున నటిగా మారారు. తెలుగులో ఆమె 1989లో తొలి చిత్రంలో నటించారు. తెలుగులో యమున నటించిన తొలి చిత్రం మౌన పోరాటం. ఆ చిత్రం గురించి యమున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడైతే వెండి తెరపై గ్లామర్ అనేది సాధారణంగా మారిపోయింది. కానీ 30 ఏళ్ల క్రితం అలా కాదు. కాస్త ఎక్స్ పోజింగ్ చేయాలన్నా హీరోయిన్లు చాలా ఆలోచించేవాళ్ళు. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. అది కూడా తొలి చిత్రంతోనే అని యమున తెలిపింది.మౌన పోరాటం చిత్రంలో యమున బికినిలో కూడా కనిపించింది.

కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి. అప్పట్లో ఎక్స్ పోజింగ్ చేయాలంటే కథ డిమాండ్ చేయాలి. ఆ సన్నివేశానికి అందంగా కనిపించడం అవసరం అయి ఉండాలి. లేకుంటే హీరోయిన్లు గ్లామర్ కు నో చెప్పేవాళ్ళు అని యమునా తెలిపింది. మౌన పోరాటం చిత్రంలో ఎక్స్ పోజింగ్ అవసరం. నేను మోసపోయే అమ్మాయి పాత్రలో నటించాలి. అలాంటప్పుడు ఎక్స్ పోజింగ్ అవసరం.నేను చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నా. పాపం డైరెక్టర్ గారు నాకు వివరించారు.

నేను ఎక్స్ పోజింగ్ చేయకుంటే సినిమానే పడిపోతుంది.ఆ కథ అలాంటిది అని యమున తెలిపింది. తర్వాత బెంగళూరులో ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిందన్న వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ విషయాలు బాగా దుమారం రేపాయి. అయితే తనను కావాలనే బ్లేమ్ చేసేందుకు ఎవరో ఈ వార్తలు క్రియేట్ చేశారని.. ఈ వార్తల వల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది ఈ భామ.

అంతేకాదు చివరకు ఆమె ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నానని చెప్పి షాక్ ఇచ్చింది.ఈ మధ్య ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత వివరాలు పంచుకుంది ఈ నటీమణి. ఇక ఇ ఇమె అందానికి నటనకి స్టార్ హీరోల సైతం మెచ్చి అవకాశం ఇచ్చారట. కానీ తెలియని తనంతో మెగాస్టార్ చిరంజీవి పక్క్న , నందమూరి బాలయ్య పక్కన నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిందట. 1990 రమా ఫిలిమ్స్, కె.నాగేశ్వర్ రావు నిర్మాణం.మురళిమోహన్ రావు దర్శకత్వంలో “కొదమ సింహం” చిత్రం విడుదలయిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి, వాణివిశ్వనాథ్, రాధ, సోనం హీరో, హీరోయిన్లుగా నటించారు.

అయితే మొదటగా ఈ సినిమాలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న యమునను సోనమ్ చేసిన పాత్రకు ముందుగా సంప్రదించారట.కానీ అప్పటికే యమున పలు చిత్రాలతో బిజీగా ఉండడంతో.. చిరంజీవి డేట్స్ కి యమున డేట్స్ కుదరక పోవడంతో ఆ స్థానంలో బాలీవుడ్ నటి “సోనమ్”ను తీసుకోవడం జరిగిందట. బాలకృష్ణ సినిమా కోసమని నా గురించి ఉషా కిరణ్ మూవీస్ వారిని కూడా సంప్రదించారని తెలిసింది. ఇప్పటిలా అప్పుడు సెల్ ఫోన్ లేకపోవడం వల్ల సరైన సమాచారం లేకపోవడంతో కొన్ని అవకాశాలు మిస్సయ్యానాని చెప్పుకొచ్చింది. తాను స్టార్ హీరోల పక్కన నటించలేనందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.

Leave a Reply