చిత్ర పరిశ్రమలో పెళ్లి కాకుండా తల్లైన హీరోయిన్స్‌ వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు.. డేటింగ్ లు.. సహజీవనం వంటివి చాలా మాములు విషయాలు. ఇది చాలా ఏళ్ల క్రితం నుంచే సినీ పరిశ్రమలో ఉంది. పలువురు హీరోయిన్స్ పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటూ ప్రెగ్నెంట్ అయిన దాఖలాలు ఉన్నాయి. పెళ్లికి ముందే వచ్చిన ప్రెగ్నెన్సీని కొనసాగించి పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ స్టార్స్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.

అతి లోకసుందరి శ్రీదేవి.. బోనీకపూర్ ను పెళ్లి చేసుకోక ముందే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ పెళ్లి సమయంలో మీడియాలో వార్తలు వచ్చాయి. బోనీకపూర్ తో పెళ్లి సమయంలో శ్రీదేవి ఏడు నెలల గర్బవతి అంటూ ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని అప్పట్లో శ్రీదేవి దంపతులు అధికారికంగా ప్రకటించకున్నా పెళ్లి అయిన మూడు నెలల్లోనే జాన్వీ కపూర్ కు శ్రీదేవి జన్మనిచ్చింది.

హీరోయిన్ సారిక కమల్ హాసన్ తో చాలా సంవత్సరాల పాటు ప్రేమాయణం సాగించింది. ఆ సమయంలో వీరిద్దరు సహజీవనం కూడా సాగించారు. అప్పుడే సారిక ప్రెగ్నెంట్ అయ్యింది. దాంతో వెంటనే సారిక.. కమల్ హాసన్ లు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో శృతి హాసన్ ను సారిక తన గర్బంలో మోస్తూ ఉండగా పెళ్లి తర్వాత వీరికి అక్షర హాసన్ జన్మించింది.రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ తో వివాహంకు ముందే అకీరాకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత పవన్.. రేణు లకు పాప జన్మించింది.

star heroines

అమృత అరోరా.. ఈమె షకీల్ లడక్ను వివాహం చేసుకుంది. అప్పటి వరకు ప్రేమలో ఉన్న వీరిద్దరు హడావుడిగా.. ఆర్భాటం లేకుండా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత అమృత అరోరా ప్రెగ్నెంట్ అని వెళ్లడయ్యింది. అందుకే హడావుడి పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

నేహా దుపియా కూడా పెళ్లికి ముందే గర్బందాల్చింది. అంగద్ బేడీతో పెళ్లికి ముందు ఆయన బిడ్డను నేహా కడుపులో మోసింది. తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడి వారు ప్రెగ్నెంట్ అని తెలియగానే వివాహం చేసుకున్నట్లుగా సమాచారం.సీనియర్ హీరోయిన్ నైనా గుప్తా కూడా పెళ్లికి ముందే తల్లి అయ్యింది. వివియన్ రిచర్డ్స్ తో ఈమె చాలా కాలం డేటింగ్ లో ఉంది. నైనా పెళ్లి సమయానికి ఒక బేబీని కలిగి ఉన్న విషయం అందరికి తెలిసిందే.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కొంకన సేన్ శర్మ కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది. రన్ వీర్ శౌరీతో రహస్య వ్యవహారం సాగించింది. చాలా కాలం పాటు ఆ వ్యవహారం కొనసాగిన నేపథ్యంలో కొంకన సేన్ శర్మ గర్బవతి అయ్యింది. వీరిద్దరు పెళ్లికి ముందే ఒక బేబీని కూడా కలిగి ఉన్నారు.అయితే తాజాగా తను తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఇలియానానే వెల్లడించింది. తన ప్రియుడు ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో సహజీవనంలో ఉన్న విశయం తెలిసిందే..

Leave a Reply