Adipurush: ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్..!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ: తండ్రి దశరధుడు కైకేయికి ఇచ్చిన మాట కోసం.. తమ్ముడు శేషు (సన్నీ సింగ్), ధర్మపత్ని జానకి (కృతి సనన్)తో కలిసి 14 ఏళ్ల వనవాసానికి వెళ్తాడు రాఘవ (ప్రభాస్). రాక్షకుడి స్థాయి నుండి నారాయణుడి హోదాను పొందే వెంపర్లాటలో జానకిని ఎత్తుకొస్తాడు రావణ్ (సైఫ్ అలీఖాన్).లంకలో బందీగా ఉన్న జానకిని.. సముద్రం దాటి.. వానర సైన్యం సహాయంతో రావణ సైన్యాన్ని ఎదిరించి చెడు పై మంచి చేసిన యుద్ధమే “ఆదిపురుష్” కథాంశం.

నటీనటుల పనితీరు: రాఘవుడిగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ & స్క్రీన్ ప్రెజన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం ఖాయం. లుక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అయినప్పటికీ.. ప్రభాస్ తన చరిష్మాతో లాక్కొచ్చాడనే చెప్పాలి.జానకీ దేవిగా కృతి సనన్ బాగా సెట్ అయ్యింది. ఆమె కళ్ళలో బాధ, ఆమె ముఖంలో హావభావాలు చక్కగా పండాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది.

సంగీత దర్శకులు అజయ్ – అతుల్ మరియు సంచిత్ బల్హార, అంకిత్ బల్హార సమకూర్చిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లు కూడా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. దర్శకుడు ఓం రౌత్ 3డిలో భారీ విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినా.. మెయిన్ గా కథనంలో ఇంట్రెస్ట్ మిస్ అయింది. నిర్మాతల నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

రేటింగ్: 2.5/5

Leave a Reply