Akhil Agent: ఏజెంట్ మూవీ రివ్యూ & రేటింగ్.?

యువహీరో అక్కినేని అఖిల్‌ ప్రతి సినిమాలో నటుడిగా పరిణితి సాధిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ప్రేమకథా చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఈ నేపథ్యంలో స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు అఖిల్‌. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. పూర్తి మేకోవర్‌తో సిద్ధమయ్యారు. అఖిల్‌ కెరీర్‌లోనే భారీ వ్యయంతో రూపొందించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అఖిల్‌ లుక్స్‌ కూడా కొత్తగా అనిపించాయి. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన ‘ఏజెంట్‌’ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో తెలుసుకుందాం.

కధ
ఏజెంట్ మూవీ మొదలవగానే మమ్ముట్టి ఒక మాఫియా ముఠా అని చెబుతారు. అతన్ని పట్టుకోవడంలో డిపార్ట్మెంట్ విఫలం అవుతుంది. దీంతో అతడికి పట్టుకోవడానికి ఒక మంచి ఆఫీసర్ కావాలని భావిస్తారు. ఈ తరుణంలోనే అఖిల్ అయితే బెటర్ అని భావించి.. అతడు అయితేనే ఇలాంటి క్రిమినల్స్ ని పట్టుకోగలడని అఖిల్ కి ఈ ఆపరేషన్ “ఏజెంట్” ని అప్పగిస్తారు. అయితే అఖిల్ వారిని ఎలా పట్టుకుంటాడు..? ఆ సమయంలో హీరోయిన్ అతడికి ఎలా పరిచయం అవుతుంది..? వారి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది..? లాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

పనితీరు

భారీ యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ కథని సురేందర్ రెడ్డి చాలా బాగా తెరకెక్కించారు. ఇంటర్వెల్ సన్నివేశం అయితే ఈ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో అఖిల్ వన్ మ్యాన్ షో. యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయి. కానీ లవ్ స్టోరీ, విలన్ రోల్, మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా కథ మాత్రం రొటీన్ గానే ఉంది. అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు చాలా బోరింగ్ గా అనిపించాయి. ఇక సినిమాలో క్లైమాక్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ కాలేదు. మొత్తానికి మూవీలో అఖిల్, మమ్ముట్టి అదరగొట్టారు కానీ కథలో దమ్ము లేదు.

ప్లస్ పాయింట్స్ :

– అఖిల్ యాక్షన్
– యాక్షన్ సీక్వెన్స్
– మమ్ముట్టి

మైనస్ పాయింట్స్:.

– స్టోరీ, స్క్రీన్ ప్లే
– మ్యూజిక్
– లాజిక్ లెస్ సీన్స్
– సెకండ్ హాఫ్

రేటింగ్‌: 2/5

Leave a Reply