Dharmavarapu Subramanyam : నాన్న‌ చనిపోతే చూసేందుకు ఆ ఫ్యామిలీ నుండి ఎవరు రాలేదు..! ధ‌ర్మ‌వ‌ర‌పు కొడుకు ఆవేద‌న‌..

టాలీవుడ్ లో కొంతమంది నటినటులు భౌతికంగా ప్రేక్ష‌కుల‌కు దూరం అయినా వాళ్ళు చేసిన పాత్రలు మాత్రం ఎప్పుడూ ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోతాయి. అలా టాలీవుడ్ కు దూరమైన నటులలో లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా ఒకరు. కమెడియన్ గా ధర్మవరపు సుబ్రమణ్యం ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోల‌కు తండ్రి పాత్రలు, కాలేజీ లెక్చరర్ పాత్రల‌కు ధర్మవరపు సుబ్రమణ్యం పెట్టింది పేరు. తనకంటూ ప్రత్యేకమైన యాసతో ధర్మవరపు సుబ్రమణ్యం టాలీవుడ్ లో స్పెషల్ గా నిలిచారు.స్టైల్ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాస్త శబ్దం వచ్చినా తట్టుకోలేని ఇంటి ఓన‌ర్ పాత్ర‌లో నటించి నవ్వించారు.

మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమాలో కన్సల్టెన్సీ అధికారి పాత్ర…. అదే విధంగా వర్షం సినిమాలో వాతావరణ శాఖ లో పని చేసే అధికారి పాత్రలో ధర్మవరపు సుబ్రమణ్యం నవ్వులు పూయించారు. ఈ సినిమాలతో పాటు అనేక సినిమాల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పాత్రలు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి.హాస్య చ‌తుర‌త ఉన్న ధ‌ర్మ‌వ‌రపు అనారోగ్యం కారణంగా అకాల మరణం పొందారు. ఇదిలా ఉంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు కూడా సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయన స్టార్ కమెడియన్ అయినప్పటికీ చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని చిత్రాల్లో నటించేవారని అన్నారు. . రెమ్యునరేషన్ డిమాండ్ చేయకుండా ఇచ్చినంత తీసుకునేవార‌ని, ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకొని కొందరు నిర్మాతలు డబ్బులు కూడా ఎగ్గొట్టారని చెప్పుకొచ్చాడు.

అయితే త‌న తండ్రిని మోసం చేసిన నిర్మాతలు ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నారని రవి బ్రహ్మ తేజ చెప్పారు.తండ్రి మ‌ర‌ణించాక పార్థివ దేహం చూసేందుకు రాజేంద్రప్రసాద్, హీరో గోపీచంద్, అలీ, వేణు మాధవ్, దగ్గుబాటి రామానాయుడుతో పాటు కొందరు చిత్ర ప్రముఖులు వచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా రాలేదు. రావాలని అనుకున్నారట.

ఎందుకో కుదర్లేదు అని ఆయ‌న అన్నారు. అయితే నాన్న చనిపోయే ముందు మాకేమీ చెప్పలేదు. ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్ కి తీసుకెళ్లలేదు. నేరుగా మా సొంత ఊరు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశాము… అని రవి బ్రహ్మ తేజ వెల్లడించారు. లివర్ క్యాన్సర్ వ‌ల‌న కొన్ని నెలలు మంచానికే పరిమితమైన ధ‌ర్మ‌వ‌ర‌పు 2013లో డిసెంబర్ 7న 59ఏళ్ల వయసులో కన్నుమూశారు.

Leave a Reply