Akhil Akkineni: అయ్యగారు సినిమాలు ఇంకా వద్దు.. రిటైర్ తీసుకోండి అంటూ దారుణంగా ట్రోల్స్,

అక్కినేని నట వారసుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో అఖిల్. మొదటి సినిమాతోనే అఖిల్ ఫ్లాప్ అందుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ అఖిల్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏఎన్ఆర్ తాత… నాగార్జున తండ్రి కావడంతో అఖిల్ పై అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అఖిల్ తర్వాత యంగ్ హీరో పలు చిత్రాలతో ముందుకు వచ్చాడు.మాస్, రొమాంటిక్ ఇలా అన్ని రకాల సినిమాల్లోనూ నటించాడు. అయినప్పటికీ ఏ సినిమా కూడా అక్కినేని అభిమానులను సంతోషపరచలేదు.

అయితే అఖిల్ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కొంతవరకు ప్రేక్షకులను మెప్పించింది. కాగా తాజాగా అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య తెర‌కెక్కింది. ఈ సినిమా ఈనెల 28న విడుదలైంది. సినిమా టీజర్ ట్రైలర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

అంతే కాకుండా సురేందర్ రెడ్డికి హిట్ ట్రాక్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ చివరికి ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. ప్ర‌స్తుతం ఏజెంట్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది.ఏజెంట్ సినిమా అయితే పెద్ద రాడ్డు అంటూ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు చెప్తున్నారు.చాల రోజులుగా సినిమ పైన అందరు ఆశలు వదిలేసుకున్నారు.

ప్యాచుల మీద ప్యాచులు వేయించుకొని, వాయిదాల మీద వాయిదాల తర్వాత బయటకు వచ్చిన అవుట్ ఫుట్ చూస్తే కేవలం జిమ్ చేసి బాడీ పెంచితే సరిపోదు కథలో దమ్ము కూడా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరో పక్క అయ్యగారు ఇంకా మీకు సినిమాలు సరిపడవు రిటైర్ అయిపోయి చక్కగా మీ తండ్రి వ్యాపారాలు చూసుకోండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Leave a Reply