150 అడుగుల ఎత్తు నుండి దూకిన అఖిల్…వీడియో వైరల్.

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏజెంట్. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈసినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈసినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 18న రిలీజ్ చేశారు.. ఇక తాజాగా విజయవాడలో వైల్డ్ పోస్టర్ ని లాంచ్ చేసింది ఏజెంట్ టీమ్. ఈ వైల్డ్ లుక్ కు మరింత రెస్పాన్స్ దక్కింది. కండలు తిరిగిన శరీరంతో, ఫెరోషియస్ లుక్ తో, సంకెళ్ళు తెంచుతూ బీస్ట్ మోడ్ లో కనిపించడం వైల్డ్ గా వుంది. మరోవైపు పోస్టర్ లాంచ్ సందర్భంగా నెవర్ బిఫోర్ ఫీట్ చేశారు.

172 అడుగుల ఎత్తు నుంచి రోప్ సహాయంతో ఏజెంట్ మోడ్ లో అఖిల్ డైవ్ చేస్తూ కిందకు దిగిన రియల్ స్టంట్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చారు.

Leave a Reply