వేల కోట్ల ఆస్తులున్నా అక్కినేని అమల బంగారం ఎందుకు ధరించదో తెలుసా?

పెళ్లి అవగానే కెమెరాకు దూరంగా జరిగింది అక్కినేని అమల. వైవాహిక జీవితం తర్వాత గ్లామర్ రోల్స్ చేయడం నచ్చలేదు కావచ్చు అని అంటారు నెటిజన్లు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అమల ఒకే ఒక జీవితం సినిమాలో కీలక పాత్ర పోషించింది. అమల అభినయాన్ని ప్రేక్షకులు ఎంతగానో కీర్తించారు కూడా. అక్కినేని వారింట కోడలుగా అడుగుపెట్టిన దగ్గర నుంచీ అమల మంచి వ్యక్తిగానే కాదు శక్తివంతమైన మహిళగా ముందుకుసాగుతోంది. భర్త నాగార్జున ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా, ఇంకో వైపు స్డూడియో అధినేతగా కొనసాగుతున్నారు.

ఇంతేకాదు ఎంటర్ టైన్ మెంట్ మీడియా భాగస్వామిగా, హోస్ట్ గా, ఆంట్రప్రెన్యూర్ గా సాగుతూ ఉండగా.. అర్ధాంగిగా ఆయనకు అన్ని విధాలుగా తన సాకారాన్ని అదిస్తుంది అమల. భర్త ఏ రంగంలో అయినా రాణించాలి అంటే భార్య సాకారం కచ్చితంగా అవసరం. అందుకే నాగార్జున ప్రతి విషయంలో పై చేయి సాధిస్తున్నారు అనేంతలా గొప్ప పేరు సంపాదించింది అమల. ఈమెకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

మూగజీవాల మీద ప్రేమతో సేవా కార్యక్రమాలు చేస్తున్న అమల.. ఇంపార్టెంట్ క్యారెక్టర్ వస్తేనే, తనకు నచ్చితేనే చేస్తున్నారు.. సెకండ్ ఇన్నింగ్స్‌‌లోనూ ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నారామె.. అయితే ఒక విషయంలో ఆమె గురించి చాలామందికి ఒక సందేహం ఉంది.. అదేంటంటే.. వేలకోట్ల ఆస్తులున్నా కానీ అమల ఒంటిమీద తులం బంగారం కూడా కనిపించదేంటబ్బా అని.. నిజమే..

మెడలో కేవలం నల్లపూసల తాడు తప్ప చేతికి గాజులు, చెవులకు పోగులు వంటివి అస్సలు పెట్టుకోరు అమల..ఇష్టం లేక కాదు కానీ ఆమెకు స్కిన్ ఎలర్జీ ఉందట.. ఒకవేళ ఆభరణాలు ఏవైనా వేసుకుంటే రాషెస్ వచ్చేస్తాయట.. వెంటనే చర్మం ఎర్రగా మారిపోతుందట.. అందుకే అమల ఎలాంటి ఆర్నమెంట్స్ ధరించకుండా సింపుల్‌గానే కనిపిస్తారట.. ఆమెకున్న ఈ ఆరోగ్య సమస్య గురించి ఇన్నాళ్లూ ఎవరికీ పెద్దగా తెలియదు.. ఇప్పుడు కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో అక్కినేని ఫ్యాన్స్ బాధపడుతున్నారు..

Leave a Reply