తారకరత్న భార్య మరో ఎమోషనల్ పోస్ట్.. ఈ జన్మకు నువ్వూ నేను మాత్రమే.. !

నందమూరి ఫ్యామిలీ నుండి టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో తారకరత్న. ఒకటో నంబర్ కుర్రోడు సినిమా తో తారకరత్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చూడ్డానికి పొడవుగా సన్నగా ఉన్న ఈ నందమూరి కుర్రాడిని చూసి స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. కానీ ఈ సినిమా తరవాత తారకరత్న వరుస ఫ్లాపులతో సతమతవుతున్నాడు. 20 కి పైగా సినిమాల్లో నటించినా కూడా ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ హిట్ పడలేదు.ఇక అమరావతి సినిమాలో తారకరత్న విలన్ గా నటించాడు.

ఈ సినిమాలో అద్భుతంగా నటించి నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ ఆ తరవాత కూడా తారకరత్న కి పెద్దగా ఆఫర్ లు వచ్చింది లేదు.నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కార్డియాక్ అరెస్ట్ కు గురైనా తారకరత్న మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచాడు. అప్పటివరకూ మౌనంగా ఉన్న అలేఖ్య రెడ్డి, తారకరత్న మరణం తర్వాత వారి ప్రేమ వివాహం, వారి మధ్య ఉన్న అనుబంధం గురించి పలు ఎమోషనల్ పోస్టులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

తద్వారా తారకరత్నకు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఆమె తన పోస్టులలో వెల్లడిస్తుంది.ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా మరో పోస్ట్ చేసిన అలేఖ్య రెడ్డి తన భర్త తారకరత్నతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ ఈ జీవితానికి ఇక నువ్వు నేను మాత్రమే.. జీవితానికి సరిపడా జ్ఞాపకాలని ఇచ్చి వెళ్లావు అంటూ అలేఖ్యరెడ్డి పోస్ట్ లో రాసుకొచ్చింది. వాటితో నేను ముందుకు వెళ్తాను.

నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అంతేకాదు మరొక పోస్టులో తారకరత్న చిన్ననాటి ఫోటోలు, తన కుమారుడి ఫోటోలు షేర్ చేసి వీళ్ళే తన స్టార్స్ అంటూ ఆమె పేర్కొంది. నిత్యం తారకరత్నకు సంబంధించిన జ్ఞాపకాలను అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఆయన మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పడానికి ఆమె చేస్తున్న పోస్టులే ఇందుకు నిదర్శనం. తారకరత్నతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె చెబుతున్న తీరు నెటిజన్లను ఆలోచించేలా చేస్తోంది.

Leave a Reply