Actor Ali | పవన్ కళ్యాణ్ మీద సెటైర్స్ తో రెచ్చిపోయిన ఆలీ.. ఈసరైన గెలువు..

Actor Ali | పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఏమైనా చేస్తానని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారులు అలీ అన్నారు.వర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చాలా సినిమాలలో ఆలీ కీలక పాత్ర పోషించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలీ మంచి స్నేహితులైన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధినేత అయితే ఆలీ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు.

కొన్ని రోజుల క్రితం వైసీపీ నుంచి ఆలీ పదవి పొందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆలీ ప్రతిపక్ష పార్టీ అయిన పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని ఆలీ అన్నారు. జగన్ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వమని ఆలీ చెప్పుకొచ్చారు.ఏపీ అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ చేసే కామెంట్స్ ఏమాత్రం అర్థం లేదని ఆలీ అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పై ఆలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

పదవి దక్కిన అధికారంతో వైసీపీ పార్టీకి సపోర్టుగా ఆలీ ఇలా మాట్లాడుతున్నారు అని కొందరు అంటున్నారు. ఈ కామెంట్ల వలన ఆలీ పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరుగుతుందని మరికొందరు అంటున్నారు. ఆలీ చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారు అని అందరూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఎంతో మంచి ఫ్రెండ్స్ అయినా పవన్ కళ్యాణ్ ఆలీ పార్టీల వలన తమ మధ్య దూరం పెంచుకుంటున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply