Alla Ramakrishna | ఆంధ్రాలో ఈ సారి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగాలి జగన్ ..! ఆళ్ల కన్నీరు

allroudadda

Alla Ramakrishna | ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైసీపీకి (YSRCP) ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరిఆళ్ల రామృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) తన శాసనసభా సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో తన రాజీనామా సమర్పించానని ప్రకటించారు. సీఎం జగన్‌కు (CM Jagan) అత్యంత విధేయుడిగా పేరున్న ఆర్కే రాజీనామా నిర్ణయం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు.

గత ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేష్‌ను ఓడించారు.కాగా, మంగళగిరి వైసీపీ ఇన్‌చార్చ్‌గా గంజి చిరంజీవిని నియమించడంతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది. రానున్న ఎన్నికల్లో తన నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన గతకొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే తాను రాజీనామా చేశానని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.

ఆర్జీవికి పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంతే ఇష్టం

మంగళగిరి అభివృద్ధి చెందాలి. దాన్ని మొదట రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు కానీ కేవలం రూ.120 కోట్లను మాత్రమే కేటాయించారు. నా సొంత డబ్బుతో నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులు చేశా. 50 ఏళ్ళలో జరగని అభివృద్ధి నాలుగేళ్ళలో చేసి చూపించా. స్వయంగా నేనే రూ.8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని చెప్పుకొచ్చారు ఆళ్ళ. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్…ధనుంజయ రెడ్డి కలమని చెబుతారు.

allroudadda
allroudadda

కానీ ఆయన ఫోన్లు లిఫ్ట్ కూడా చేయడు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తేనే ఓట్లు అడిగి హక్కు ఉంటుంది.సంక్షేమం ఎంత చేసినా ప్రజలు అభివృద్ధిని మాత్రమే చూస్తారన్నారు ఆళ్ళ రామకృష్ణ. రాజధాని రైతులకు మద్దతుగా ఉండాలా లేదా అనేది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చెప్తాను. తొమ్మిదిన్నర సంవత్సరాలు వైసిపి కోసం పనిచేశా కానీ ఇకపై వైసీపీలో ఉండేది లేదని చెప్పారు.

బిజినెస్ మ్యాన్ తో రష్మి పెళ్లి ఫిక్స్.. షాక్ లో సుధీర్..

తాను ఎవరినీ నిందించడం లేదని…తన రాజీనామాను ఆమోదించకపోవడం వాళ్ళమని చెప్పారు. తాను పార్టీ వీడడానికి సమాధాన్ సీఎం జగనే చెప్పాలని అంటున్నారు ఆర్కే. తనను చాలా మంది ఇతర పార్టీల్లోకి రావాలని ఆహ్వానించారని కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. అందుకే షర్మిలతో ఉండాలనే నిర్ణయించుకున్నానని తెలిపారు. జగన్ తనకు పార్టీ టికెట్ ఇవ్వలేదని పార్టీ వీడలేదని…పొమ్మనలేక పొగబెట్టారని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply