Alla Ramakrishna Reddy | ఇదేం ట్విస్ట్ .. వైసీపీలోకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రీఎంట్రీ..?

allroudadda

Alla Ramakrishna Reddy | వైసీపీలో ఆర్కే అనబడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అమరావతి పుణ్యమాని అలాగే మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించిన నేపధ్యం వల్ల కానీ ఫ్యామస్ అయిపోయారు. ఆయన వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. అంతే కాదు జగన్ కి అత్యంత సన్నిహితుడు. ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున సత్తెనపల్లిలో పోటీకి టికెట్ సాధించాలనుకున్నారు కానీ చివరి నిముషంలో మిస్ అయింది. ఆయన కోరికను జగన్ రెండు సార్లు నెరవేర్చారు.

అలాగే జగన్ కలను ఆర్కే కూడా నెరవేర్చారు. మంగళగిరిలో 2019లో నారా లోకేష్ ని ఓడించి ఆర్కే జగన్ కళ్ళలో ఆనందం చూశారు. కానీ జగన్ అప్పట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన హామీ ఒకటి నిలబెట్టుకోలేదు అన్న బాధ అయితే ఆర్కే ఉంది. తనకు మంత్రి పదవి ఇవ్వలేదు అని ఆయన చాలా బాధపడ్డారు. తొలి విడతలో కాకపోతే మలి విడతలో అయినా పదవి దక్కుతుంది అని అనుకున్నా అది జరగలేదు.అలా బాధ కాస్తా అసంతృప్తిగా మారింది.

allroudadda
allroudadda

అది చివరికి ఆర్కేకు మంగళగిరిలో 2024లో టికెట్ దక్కదు అన్న మాట రావడంతో పెల్లుబికింది. అంతే ఆయన గత డిసెంబర్ లో పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అంతే కాదు ఆయన షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆమె పార్టీలో చేరిన తొలి ఎమ్మెల్యేగా సంచలనం రేపారు.తాజాగా ఆయన సీఎం జగన్ ని కలిశారు. మళ్లీ వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్‌.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి పార్టీలోకి ఆహ్వానం పలికారు.

watch | గుడిలోకి వెళ్తే వేల ఖర్చు.. చర్చ్ కు, దర్గాకు వెళ్తే రూపాయి ఖర్చు కాదు..

వైఎస్‌ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆ పార్టీలో చేరిన వారిలో మొదటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే.. తనని షర్మిల పెద్దగా పట్టించుకోవడం లేదన్న బాధతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపారు. తిరిగి వైసీపీలో చేరేలా చర్చలు కొనసాగించారు. ఇక చివరకు ఆళ్ల నిర్ణయం మార్చుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఏపీలో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ జోష్‌ కనిపిస్తోంది.. తాజాగా ఆళ్ల నిర్ణయం ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చినట్లు అయ్యింది.

Recent Posts

Leave a Reply