Geetha Arts | గీతా ఆర్ట్స్‌లో గీతా అంటే అల్లు అరవింద్ ప్రియురాల.?

allroudadda

Geetha Arts | ఆ మధ్య 69 వ నేషనల్ అవార్డ్ ను బన్నీ కైవసం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేస్తున్నారు. ఇక విషయం తెలియడంతో అల్లు అరవింద్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. పుష్ప సినిమా నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ ను కలిసి ఆయనకు స్వయంగా విషెస్ తెలిపారు.

దీనికి అల్లు అరవింద్ స్పందిస్తూ.. ప్రశ్నలు, సమాధానాలు లేవు.. 69 ఏళ్లుగా తెలుగు పరిశ్రమకు రాని ఒక అద్భుతాన్ని తీసుకువచ్చిన ఈ తెలుగు ప్రేక్షకులకు, సినిమా తీసిన నిర్మాతలకు, దర్శకులకు, ఇతర సినిమా బృందానికి, మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకువెళ్లిన మా అబ్బాయికి కృతజ్ఞతలు అన్నారు. కాగా, అల్లు అర్జున్ నివాసానికి పుష్ప సినిమా నిర్మాతలు వచ్చారు. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్‌ను కౌగిలించుకొని ఆనందం వ్యక్తం చేశారు. అల్లు అరవింద్ పుత్రోత్సాహంతో కనిపించారు.

allroudadda
allroudadda

అలాగే అల్లు అరవింద్ ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహించిన ఓ ప్రోగ్రాం లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో అసలు గీతా ఆర్ట్స్ అని ఎందుకు పేరు పెట్టారు.. గీత అంటే ఎవరు అని అలీ అడిగారు. దానికి అల్లు అరవింద్ సమాధానమిస్తూ.. తన గర్ల్ ఫ్రెండ్ పేరు గీతా అని అన్నారు కానీ అందుకు తమ నిర్మాణ సంస్థకు ఆ పేరు పెట్టలేదు అని సరదాగా అన్నారు అల్లు అరవింద్.తన సంస్థకు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్‌నర్స్ ఆలోచిస్తున్న సమయంలో అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్‌ పేరును సూచించారట.

KCR | ఓటమి తరువాత తొలిసారి జనంలోకి కేసీఆర్.. ఇంకా రేవంత్ ఔట్..?

గీత అంటే భగవత్ గీత అని అర్ధం.. అందులో చెప్పినట్టుగా ప్రయత్నం మాత్రమే చేయాలి ప్రతిఫలం మన చేతిలో ఉండదు.. చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. అందుకే గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టాం అని తెలిపారు అల్లు అరవింద్. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే తప్ప, రిజల్ట్‌ మన చేతిలో ఉండదు’ అన్న విధంగా సంస్థకు గీతాఆర్ట్స్ అని పెడదాం అని చెప్పారట అల్లు అరవింద్. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply