Allu Arjun | అల్లు అర్జున్ ఎన్ని బిజినెస్ లు చేస్తున్నారో తెలుసా…

allroudadda

Allu Arjun | సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో సక్సెస్ అయినటువంటి అల్లు అర్జున్( Allu Arjun ) కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఒకవైపు సినిమాలలో నటిస్తూ హీరోగా కొనసాగడమే కాకుండా మరోవైపు బిజినెస్ ( Business )రంగంలో కూడా దూసుకుపోతున్నారు.

ఇలా ఎంతో మంది హీరోలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున వ్యాపారాలను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఎన్నో రకాల వ్యాపారాలను చేస్తూ నెలకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఎలాంటి బిజినెస్ లు చేస్తున్నారు.ఎన్ని బిజినెస్ లు చేస్తున్నారనే విషయానికి వస్తే… అల్లు అర్జున్ హీరోగా కొనసాగుతూనే ఈయన అల్లు స్టూడియోస్ ( Allu Studious )ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.

allroudadda
allroudadda

తన తాతయ్య అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు అర్జున్ అల్లు స్టూడియోని ఏర్పాటు చేశారు.అదేవిధంగా ఆహా ( Aaha ) ఓటిటి ప్లాట్ ఫాం కూడా ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక వీటితోపాటు తాజాగా అల్లు అర్జున్ ఏషియన్ వారితో ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ( AAA Multiplex ) థియేటర్ ని కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.ఈ మల్టీప్లెక్స్ లో ఎన్నో అత్యధిక సదుపాయాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇక వీటితోపాటు వైల్డ్ వింగ్స్ బఫే అనే బార్ అండ్ రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు.ఇక్కడ ఫుడ్ కూడా బాగా టేస్ట్ గా ఉండడంతో పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది.ఈ రెస్టారెంట్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది.ఇక్కడ ఎల్లప్పుడూ ఏదో రద్దీగా ఉండడంతో ఈయన రెస్టారెంట్ కూడా మంచి ఆదాయాలలో నడుస్తుందని తెలుస్తుంది.ఇలా హీరోగా కొనసాగుతూనే అల్లు అర్జున్ బిజినెస్లను చూసుకుంటూ నెలకు కొన్ని కోట్లలో ఆదాయం పొందుతున్నారు.

Leave a Reply