కారు డ్రైవర్‌కు రూ.15 లక్షలు సాయం చేసిన అల్లు అర్జున్.. కారణం ఇదే!

అల్లు అర్జున్ వద్ద బోరబండకు చెందిన మహిపాల్ అనే వ్యక్తి గత పదేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నారు. వరంగల్‌కు చెందిన మహిపాల్ ఎంతో నమ్మకంగా ఉండటంతో అల్లు అర్జున్ అతన్ని తన వ్యక్తిగత కారు డ్రైవరుగా కొనసాగిస్తున్నారు. అయితే సాయం చేయడంలో ముందు వరుసలో ఉంటాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

చేయి చాచి అడిగితే కాదనుకుండా ఇచ్చే గొప్ప మనసు బన్నీది. ఇప్పటికే కేరళ విద్యార్థి చదువుకు బన్నీ సాయపడ్డ విషయం తెలిసిందే కదా! తాజాగా కష్టాల్లో ఉన్న తన సిబ్బందికి సాయం చేసి అండగా నిలబడ్డాడంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్‌ దగ్గర మహిపాల్‌ అనే వ్యక్తి దాదాపు పదేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఎంతో నమ్మకంగా ఉండటంతో బన్నీ అతడినే తన వ్యక్తిగత డ్రైవర్‌గా కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే మహిపాల్‌ బోరబండలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన హీరో.. మహిపాల్‌ కుటుంబసభ్యులను కలిసి రూ.15 లక్షల మేర ఆర్థిక సాయం అందించాడట! బన్నీ చేసిన సాయంతో మహిపాల్‌ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.

Leave a Reply