Amala Paul | ఏడు నెలల కడుపుతో పబ్ లో అమలాపాల్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..

allroudadda

Amala Paul | తెలుగులో సూపర్ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకుంది అమలాపాల్ (Amala Paul)‌. పాపులర్‌ డైరెక్టర్ ఏఎల్‌ విజయ్‌ను 2014లో పెళ్లి చేసుకున్న నటి.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో 2017తో విజయ్‌ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లపాటు ఒంటరిగానే ఉంది. ఈ క్రమంలో గతేడాది రెండో వివాహం చేసుకుంది.

లాంగ్‌ టైమ్‌ బాయ్‌ఫ్రెండ్‌, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్‌ జగత్‌ దేశాయ్ (Jagat Desai)‌‌తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది నవంబర్‌ మొదటివారంలో కోచిలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.తాజాగా అమలాపాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.

allroudadda
allroudadda

ఒక చిన్న పాపను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసింది. టూ హ్యాపీ కిడ్స్ అని క్యాప్షన్ పెట్టింది. అమలాపాల్ తొలుత తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. జగత్ దేశాయ్ ని పెళ్లాడింది. సినిమాల విషయానికి వస్తే అమలాపాల్ ప్రస్తుతం మూడు మలయాళ సినిమాలు చేస్తోంది.

Recent Posts

Leave a Reply