Ambati Rambabu | అంబటి రాంబాబు సూపర్ డ్యాన్స్.. సినిమాలో పెడితే సూపర్ హిట్..

Ambati Rambabu

Ambati Rambabu | పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి ‘సంబరాల రాంబాబు.. అంబటి రాంబాబు’ అనే ప్రత్యేక పాటకు స్టెప్పులు వేశారు. కాగా గత ఏడాది మంత్రి చేసిన డ్యాన్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

గతంలో ఒకరిద్దరు నాయకులపై పాటలు ఉండేవి. ఇటీవల ఈ సంప్రదాయం పంచాయతీ ఎన్నికల్లో కూడా కనపడుతోంది. మంత్రి అంబటి రాంబాబు కూడా తనపై ఓ పాట రాయించుకున్నారు. సంబరాల రాంబాబు, అంబటి రాంబాబు అంటూ సాగే ఆ పాటకి ఆయనే స్టెప్పులేశారు. ఆ స్టెప్పులు, ఆయన ఉత్సాహం చూస్తుంటే.. బాగానే రిహార్సల్స్ చేసినట్టు అనిపిస్తోంది. భోగి మంట ముందు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు అంబటి. తాను పాలిటిక్స్ లో పొలిటికల్ రాంబాబుని అని, సంక్రాంతికి సంబరాల రాంబాబుని అని చెప్పుకొచ్చారాయన.

Ambati Rambabu
Ambati Rambabu

గతంలో అంబటి రాంబాబు వేసుకున్న టీ షర్ట్ ని పోలి ఉండే దుస్తుల్ని ‘బ్రో’ సినిమాలో నటుడు పృథ్వికి వేసి ఆ క్యారెక్టర్ కి శ్యాంబాబు అనే పేరు పెట్టి పెద్ద సీన్ క్రియేట్ చేశారు. అయితే ఈసారి మంత్రి అంబటి మళ్లీ అలాంటి టీ షర్ట్ వేసుకోవడం విశేషం. ఎక్కడా తగ్గేది లేదు అనే సందేశం పంపించడం కోసమే ఆయన అదే డ్రెస్సింగ్ లో బయటకు వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం అంబటి డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీనికి జనసేన నుంచి కౌంటర్లు ఉంటాయో లేదో.. ముఖ్యంగా పవన్ కల్యాణ్ స్పందిస్తారేమో చూడాలి.

Leave a Reply