Devotional  | అమ్మవారికి కట్టిన చీరలు మనం కొనుక్కొని కట్టుకోవచ్చా? అయితే ఇది చదవండి..

allroudadda

Devotional  | నిజానికి అమ్మవారి గుళ్ళల్లో అమ్మవారికి చీరలను కట్టించిన తర్వాత, ఆ చీరలను ఏం చేస్తారు.. అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతూనే ఉంటుంది. అంతే కాదు కొంత మంది గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో అమ్మవారికి కట్టించిన చీరలను ..పూజారులను అడిగి మరీ వాటిని ఇంటికి తీసుకెళ్తూ వుంటారు.. అమ్మవారికి కట్టించిన చీరలను మనం కట్టుకోవాలా.. లేదా.. ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలపై కొంతమంది అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉంటారు..

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అమ్మవారి గుడిలకి వెళ్ళినప్పుడు, అక్కడ అమ్మవారికి ధరించిన పూలను.. తీసుకొని సిగ లో పెట్టుకుంటాము.. ఇక మగవారైనా సరే ,ఆడవారికైనా సరే ఒకసారి అమ్మవారికి సమర్పించబడిన పూలను మనం తీసుకొని పెట్టుకోవడం వల్ల , వారి అనుగ్రహం మనపై ఉంటుంది అని నమ్మకం.. గుళ్లో పెట్టే ప్రసాదాలను కూడా స్వీకరిస్తూ వుంటాము..

allroudadda
allroudadda

ఇకపోతే ఇంట్లో నోములు చేసుకున్నప్పుడు అమ్మవార్లకు చీరలను సమర్పిస్తారు అనే విషయం అందరికి తెలిసిందే..అయితే కొందరు భక్తులకు అమ్మవారికి కట్టిన చీరలు ధరించవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంటుంది.అమ్మవారికి కట్టిన చీరలు సాధారణ భక్తులు నిరభ్యంతరంగా ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ వస్త్రాలు ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

Voter List | ఓటరు లిస్టులో మీ పేరు ఉందా, లేదా – ఇలా చెక్ చేసుకోండి..!!

అలాంటి చీరలను శుక్రవారం నాడు మాత్రమే ధరించాలి. వాటిని ధరించినప్పుడు కోపాలూ అసహనాలూ లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, భగవన్నామ స్మరణ చేయడం మంచిది. రాత్రి సమయాల్లో ధరించకూడదు. ఈ చీరను ఉతికినప్పుడు ఆ నీళ్లను ఎక్కడపడితే అక్కడ పోసి తొక్కకుండా, మొక్కల్లో మాత్రమే పోయాలి. అన్నిటి కంటే ముఖ్యమైన సూత్రం నెలసరి సమయంలో ఆ వస్త్రాల జోలికి వెళ్లకూడదు. ఈ నియమాలు పాటించినప్పుడే అమ్మవారి అనుగ్రహం ధరించినవారి మీద ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.

Leave a Reply