Amrapali | ఆమ్రపాలి IAS రియల్ లైఫ్ స్టోరీ..

www.allroudadda.com

Amrapali | తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదీలీలు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలికి కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) కమీషనర్ బాధ్యతో పాటు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్.డిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతకుమారి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు.అయితే అసలు ఎవరు ఈ ఆమ్రపాలి అంటే కదా.. ఇప్పుడు తెలుసుకుందాం..

ఆమ్రపాలి 1982, నవంబరు 4న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కాట వెంకట్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించింది. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి విశాఖపట్నం కి చెందినవారు. వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు.ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదువుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు ఐఐఎం నుండి పీజీ డిప్లమా కూడా చేశారు.

Amrapali | యువతలో మంచి ఫాలోయింగ్

Amrapali
Amrapali

2010 ఏపి క్యాడర్ కి చెందిన ఆమె. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ కు ఎంపికైన అతి పిన్నవయస్కుల్లో ఒకరు ఆమె. 2011 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన తన సమీర్ శర్మా ను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2018 ఫిబ్రవరి 18న వీరి పెళ్లి జరిగింది.చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్యలో ఈ వివాహ వేదిక అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

Amrapali
Amrapali

సమీర్ ఢిల్లీకి చెందినవారు. 2011లో సమీర్ ఐపీఎస్ కి ఎంపిక అయ్యారు. ఆమ్రపాలి విశాఖ జిల్లాకు చెందినవారు. ఈమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన అభ్యర్థి. వరంగల్ అర్బన్ కలెక్టర్ గా మూడు సంవత్సరాల పాటు పని చేశారు. అక్కడ కలెక్టర్ గా పని చేసినందుకు కాలం తన పనితీరుతో బాగా హైలైట్ అయ్యారు.ఆమ్రపాలికి తెలుగు రాష్ట్రాల్లో యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఆమ్రపాలి యాక్టివ్ గా ఉంటారు. వరంగల్లో పనిచేసిన అనంతరం పిఎం ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు.

Leave a Reply