Ananth Ambani | కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ

allroudadda

Ananth Ambani | జామ్ నగర్ లో ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ మూడు రోజుల ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరైన ఈ వేడుక అత్యంత వైభవంగా జరుగుతోంది. ఇంత సందడిగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనంత్ అంబానీ మాట్లాడిన మాటలతో ముకేశ్ అంబానీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. “నా కుటుంబం నన్ను చాలా ప్రత్యేకంగా చూసింది. నాకు ప్రత్యేకమైన స్థానం కల్పించింది.

నేను ఆగర్భ శ్రీమంతుడైన కొడుకునైనప్పటికీ.. నా జీవితం పూల పాన్పు కాదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చిన్నప్పటి నుంచి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. జీవితం మొత్తం నాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో నాకు జన్మనిచ్చిన మా అమ్మానాన్న అండగా ఉన్నారు. నేను ఇబ్బంది పడకుండా ఏమేం చేయాలో అవన్నీ సమకూర్చారు. ఇవన్నీ ఇంతలా జరుగుతున్నాయి అంటే దానికి మా అమ్మ కారణం.

allroudadda
allroudadda

ఆమె గత కొద్ది రోజులుగా రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంది. అమ్మా నాకు ఇవన్నీ చేసినందుకు నీకు థాంక్స్” అంటూ అనంత్ వ్యాఖ్యానించాడు.అయితే నిజానికి దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడు.. ప్రపంచంలోనే టాప్ కుబేరుల్లో ఒకరు.. మొత్తం ఆస్తుల విలువ రూ.15 లక్షల కోట్లు ఉంటుందేమో..? కోరుకున్నది కాళ్ల దగ్గరకు తెచ్చుకోగల సామర్థ్యం.. అనుకున్నది నెరవేర్చుకోగల సత్తా.. అంతటి వ్యక్తికీ కష్టాలు ఉంటాయా? ఎందుకుండవు..? ఈ ఉదాహరణను చూస్తే తెలుస్తోంది .

ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నా మహాసేన రాజేష్‌..

ముఖేష్ అంబానీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి. భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సంస్థకు అధినేత. తండ్రి వ్యాపార వారసత్వాన్ని వేరొక స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. ఇక ముఖేష్ అంబానీ-నీతా అంబానీ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో అనంత్ అంబానీ చిన్నవాడు. ఇతడి కంటే ముందు ఆకాశ్, ఇషా జన్మించారు (వీరిద్దరూ కవలలు). ఈ అన్నాచెల్లెళ్లకు ఇప్పటికే వివాహాలు అయ్యాయి. మిగిలింది అనంత్. రాధికా మర్చంట్ తో వివాహం కుదరగా.. ప్రస్తుతం ప్రి వెడ్డింగ్ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి.

Leave a Reply