అవకాశాల కోసం ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న అనన్య.?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలంటే అందం చాలా అవసరం.ఇందులో భాగంగానే చాలామంది సినీ తారలు తాము అందంగా కనిపించాలి అని రకరకాల సర్జరీలో చేయించుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా తమ అందం పెంచుకోవడానికి శరీర భాగాల కూర రకాల సర్జరీలు చేయించుకోవడం మనం చూసాం. ఇక అలా చాలామంది హీరోయిన్స్ ఈ సర్జరీల విషయంలో చాలా రకాల ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది హీరోయిన్స్ చేయించుకున్న సర్జరీలో వికటించాయి అంటూ ప్రచారాలు కూడా చేశారు.

అయితే తాజాగా ఇప్పుడు ఒక తెలుగు అమ్మాయి విషయంలో కూడా ఇదే జరిగింది. తెలుగు అమ్మాయిల ఎంతో అందంగా కనబడే అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మల్లేశం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులను కొట్టేసింది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది .

మొదటి సినిమాతో తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈమె దాని అనంతరం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశాన్ని సైతం దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. మొదటి సినిమాలో హీరోయిన్ నటించినప్పటికీ దాని అనంతరం హీరోయిన్గా మాత్రం ఈమెకి పెద్దగా అవకాశాలు రాలేదు.ప్రస్తుతం ఈమె హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

ఈ నేపథ్యంలోనే తన సోషల్ మీడియా వేదికగా తనకి సంబంధించిన రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈమె. తనకి సంబంధించిన గ్లామరస్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా అనన్య తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలో అనన్య చాలా అందంగా ఉంది .కానీ ఈ ఫోటోలో తన పెదాలు మాత్రం చాలా వింతగా కనిపించాయి. ఈ క్రమంలోని ఈ ఫోటో చూసిన వారందరూ పెదాలకు అనన్య సర్జరీ చేయించుకుంది అని అంటున్నారు .అంతేకాదు అనన్య లిప్స్ పై రకరకాల రూల్స్ చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న ఈమె లిప్స్ కంటే గతంలోనే అనన్య చాలా అందంగా ఉందని కూడా అంటున్నారు.!!

Leave a Reply