Anchor Shyamala: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకర్ శ్యామల ! ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి, బుల్లితెర యాంకర్ శ్యామల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాంకరింగ్ తో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకుంది శ్యామల. వెండితెరపై కూడా పలు సినిమాలలో సహాయక పాత్రలలో నటించి మెప్పించింది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు చెందిన ఈమె మొదట్లో సీరియల్స్ లో నటించేది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. అయితే ఇదే సమయంలో బుల్లితెరపై క్లిక్ అవడంతో బిజీ యాంకర్ గా రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

టీవీ యాంకర్ గానే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక శ్యామల నటుడు నరసింహను లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. మరోవైపు శ్యామల సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తోంది. “ఏం చెప్పారు శ్యామల గారు” అనే పేరుతో ఛానల్ ప్రారంభించింది శ్యామల. ఇక ప్రస్తుతం యాంకరింగ్ చేస్తూ.. టీవీ షోలు, సినిమా ఫంక్షన్స్ లో సందడి చేస్తుంది.

ఈమెకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ క్రాస్ అయింది శ్యామల. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.అయితే ఈ మధ్య శ్యామల పెడుతున్న ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో శ్యామల చాలా బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సన్నబడి నాజూకుగా మారింది.

ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసరికి నెటిజెన్స్ తో పాటు ఆమె అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. కొన్ని వారాలుగా ఆమె వర్క్ ఔట్స్ చేస్తూ ఇలా సన్నగా మారిందని అంటున్నారు.

శ్యామల కొత్తగా సారీ లుక్ లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సన్నబడటమే కాదు ఈ వయసులో కూడా శ్యామల ఇంత అందంగా ఉందంటే మామూలు విషయం కాదు.

Leave a Reply