యాంకర్ సుమని అరెస్ట్ చేసి ఎలా తీసుకెళ్తున్నారో చూడండి..!

తెలుగు ఇండస్ట్రీలో .. తెలుగు బుల్లితెరపై .. యాంకర్ సుమ అన్న పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో క్రేజ్ తో.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సుమ .. కేవలం యాంకర్ గానే కాదు పలు సినిమాల్లో నటించి మెప్పించింది . అంతేకాదు పలు ఈవెంట్స్ కి.. హోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో.. యూట్యూబ్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటుంది . పేరుకు మలయాళ బ్యూటీ అయినా సరే తెలుగింటి కోడలుగా తన మాటలతో మైమరిపిస్తున్న యాంకర్ సుమ కనకాల అరెస్ట్ అయ్యింది అన్న వార్త అభిమానులను టెన్షన్ పెడుతుంది.

అసలే ఈ మధ్య సుమకి, రాజీవ్ కనకాలకి మధ్య విభేదాలు తలెత్తాయనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఏమైనా చేయకూడని పని చేసి ఉంటుందా? అందుకే పోలీసులు అరెస్ట్ చేశారా? లేదంటే.. ఈ మధ్య ప్రతి ఫంక్షన్‌లో హీరోలు మాట్లాడేటప్పుడు ఎవరో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి.. వారి కాళ్లమీద పడిపోతుండటం గమనించిన సుమ .. అలా వస్తున్న వారినెవరినైనా కత్తితో కసకసమని పీక కోసేసి ఉంటుందా?

ఏమో ఏదైనా జరిగి ఉండవచ్చు. సుమ అసలే హైపర్ యాక్టివేటెడ్ ఉమెన్. ఏదైనా జరిగి ఉండవచ్చు. అందుకే ఆమెను అరెస్ట్ చేసి ఉండవచ్చు అనేలా రకరకాలుగా సుమ అరెస్ట్‌పై కామెంట్స్ నడుస్తున్నాయి.అయితే అసలు విషయం తెలిసి అంతా నోరెళ్లబెడుతున్నారు. వాస్తవానికి సుమ అరెస్ట్ అయిందంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు కదా. ఈ మధ్య సినిమాల ప్రమోషన్స్ కోసం, వార్తలను హైలెట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

అక్కడెక్కడో యుద్ధం జరిగితే.. ఆ యుద్ధం పక్కనుండి కవర్ చేసినట్లుగా, బాత్ టబ్‌లో హీరోయిన్ చనిపోతే.. అందులో పడుకుని ఇలా చనిపోయిందా? అలా చనిపోయిందా? అనేలా హైలెట్ చేసే స్థాయికి మైండ్ సెట్స్ చేరినప్పుడు.. ఒక సినిమా ప్రమోషన్ కోసం సుమ అరెస్ట్ కావడం పెద్ద విషయమే కాదు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమనేది ఇట్టే అర్థమైపోతుంది.

Leave a Reply