Suma Kanakala | పాపం సుమను వారం రోజులు గదిలో పెట్టి ఇబ్బంది పెట్టిందో ఎవరో తెలుసా.

allroudadda

Suma Kanakala | టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో సుమ – రాజీవ్ కనకాల జంట కూడా ఒకటి. ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు. సుమ బుల్లితెరపై వరస షోలు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ బిజీగా మారుతుండగా, అటు రాజీవ్ కనకాల అగ్ర హీరోల సినిమాల్లో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. తాజాగా సుమ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

“రాజీవ్ నాకు మొదట ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత నాతో మెల్లి మెల్లిగా మాట్లాడటం, కలవడంతో మా మధ్య చనువు పెరిగింది. దాంతో నా బిహేవియర్ తనకి బాగా నచ్చింది. ఇక నేను కూడా చూడ్డానికి బావున్నాడు.. ఒక సినిమా హీరో లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి అనుకున్నా. ఆ సమయంలో రాజీవ్ ఇంకా సినిమాల్లో ఎక్కువ పాపులర్ కాలేదు. అయినా కూడా బాగున్నాడు కదా అని అనుకున్నా. కానీ రిస్ట్రిక్షన్స్ అన్ని మనసులో పెట్టుకున్నాక..

allroudadda
allroudadda

ముందు వద్దనుకున్నా. అది కూడా పేరెంట్స్ వల్ల వద్దనుకున్నా. కానీ ఆ తర్వాత రాజీవ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి విన్నప్పుడు ఒక మంచి మనిషిని మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. నా తల్లిదండ్రులు నచ్చక దాదాపు వారం రోజులపాటు ఒక గదిలో బంధించి గదికి తాళం వేశారు అంటూ ఈ సందర్భంగా సుమ వెల్లడించారు అయితే చివరికి తన ప్రేమను గుర్తించినటువంటి తల్లిదండ్రులు చివరికి ఆయనతోనే నాకు పెళ్లి చేశారు అలా మా జర్నీ స్టార్ట్ అయింది”అలాగే మా ఇద్దరిలో ముందుగా కోపం వచ్చేది మా ఆయనకే.

YS Jagan | రేవంత్ రెడ్డి కి జగన్ మాస్ వార్నింగ్ ..!

కాంప్రమైజ్ అయ్యేది కూడా ఆయనే. ఒక్కోసారి నా మిస్టేక్ ఉన్నప్పుడు నేను ముందు కాంప్రమైజ్ అవుతా. కానీ ఎక్కువసార్లు కాంప్రమైజ్ అయ్యేది మాత్రం తనే. నాకు రాజీవ్ లో అతని కోపం అంటే అసలు నచ్చదు. అతనిలో కోపం చాలా ఫాస్ట్ గా వస్తుంది. అంతే ఫాస్ట్ గా కు వెళ్తుంది. కానీ ఆ కోపం రావడమే ఒక రేంజ్ లో వస్తుంది. అది నాకు నచ్చదు. ఇక అంతకుమించి రాజీవ్లో నచ్చనిది ఏదైనా ఉందంటే టైమింగ్స్. నేను ఒక టైమింగ్ ఫిక్స్ చేస్తే రాజీవ్ దాన్ని ఇంకాస్త పొడిగిస్తాడు. ఈ విషయంలో కూడా మా మధ్య గొడవలు జరుగుతాయి” అంటూ చెప్పుకొచ్చింది సుమ.

Recent Posts

Leave a Reply