క్యాస్టింగ్‌ కౌచ్‌పై విష్ణుప్రియ సంచలన కామెంట్స్,

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ పదం మళ్లీ ఎక్కువగా వింటున్నాం. అఫ్‌ కోర్స్‌ ఒకప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ ఉండేది.. కానీ బయటపెట్టడానికి నాడు భయపడేవారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ధైర్యం చేసి మరి మమ్మల్ని పలానా డైరెక్టర్‌.. పలానా ప్రొడ్యూసర్‌ పక్కలోకి రమ్మన్నాడు ..వాళ్ల కోరికలు తీర్చమన్నారు అంటూ ధైర్యంగా పేర్లు కూడా చెబుతున్నారు. అలా చెప్పినా కానీ సినీ ఇండస్ట్రీలో న్యాయం జరుగుతుందన్న భరోసా మాత్రం లేదు.

ఇప్పటికే అలా చెప్పిన హీరోయిన్స్, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు అందరూ కూడా పక్కన పడిపోయారు..రీసెంట్‌ గా బుల్లితెర యాంకర్‌ విష్ణుప్రియ కూడా అదే లిస్టులోకి చేరింది. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెరపై కూడా అలాంటివి జరుగుతున్నాయని బాంబు పేల్చింది. విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ‘‘పోవే పోరా’’ అనే షోతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తనదైన స్టైల్‌ లో హాట్‌ ఫొటో షూట్స్‌ చేస్తూ కొన్ని సినిమాల్లో కూడా నటించింది.

నిజానికి అమ్మడు వెండి తెర కన్నా బుల్లితెరపైనే బాగా పాపులర్‌ అయింది. సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌ గా ఉండే ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎప్పటికప్పుడు తన హాట్‌ హాట్‌ ఫొటోలు షేర్‌చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. రీసెంట్‌ గా ఈ బ్యూటీ ‘‘జరీ జరీ’’ అంటూ సాగే ఓ వీడియో సాంగ్‌ కూడా చేసింది. ఆ సాంగ్‌లో విష్ణుప్రియ హాట్‌గా ఉందని కుర్రకారు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ సాంగ్‌ ప్రమోషన్‌ కోసం కోసం ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. విష్ణుప్రియ. ఇందులో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉన్న మాట సత్యం. అది అందరికీ తెలుసు. నన్ను కూడా సినిమా అవకాశాల పేరుతో వాడుకోవాలని చూశాడు ఓ బడా డైరెక్టర్‌. సినిమా అవకాశం ఇస్తాం అంటూ తన కెరియర్‌ మొదట్లో ఓ డైరెక్టర్‌ తనతో మిస్‌ బీహేవ్‌ చేయడానికి ట్రై చేశాడు’ అని పేర్కొంది.

‘సినిమాలో చాన్స్‌ ఇస్తాం మరి నా కోరిక తీరుస్తావా’ అంటూ డైరెక్టర్‌ డైరెక్ట్‌గా అడిగాడని తెలిపింది. కానీ తనకు అలాంటి చెత్త పనులు చేసి అవకాశాలు దక్కించుకునే కర్మ పట్టలేదని ఆయన ముఖాన చెప్పినట్లు తెలిపింది. దీంతో విష్ణు ప్రియ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. అంతేకాదు కొందరు నెటిజన్స్‌ ‘‘నిజంగానే విష్ణు ప్రియ డైరెక్టర్‌కు కమిట్మెంట్‌ ఇవ్వలేదా ..?’’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply