నాపిల్లలకి మూగ చెవుడు..! దయనీయ పరిస్థితిలో అనితా ఓ అనితా సింగర్,

‘అనితా ఓ అనితా.. నా అందమైన వనితా
దయలేదా కాస్తయినా నా పేద ప్రేమపైనా’’

ఈ పాట అందరికీ తెలిసిందే. ఏ సినిమాలోనిదీ కాదు, ఏ స్టార్ సింగరో పాడినదీ కాదు, స్టార్ రైటర్ రాసినదీ కాదు. ఓ మామూలు యువకుడు రాసి పాడింది! 2008లో ప్రైవేట్‌గా విడుదలైన ఈ పాట దానికదే ట్రెండ్ సెట్టర్. కోట్లాది ప్రేమికులను భగ్నప్రేమికులను ఉర్రూతలూగించి ఏడిపించిన పాట ఇది. బ్రేకప్ సాంగ్ అంటే ఇదే గుర్తొచ్చేంతగా ఆదరణ పొందిన ఈ పాట సృష్టికర్త నాగరాజు. ఎంత ఊపుతో వచ్చాడో అంతే ఊపుతో కనుమరుగైపోయాడు ఆయన. చనిపోయాడని, ఆరోగ్యం బాలేదని ఏవోవో వార్తలు రావడం తప్ప ఆయన గురించి పెద్దగా ఏమీ తెలియదు.

ఐతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాల గురించి చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. నాగరాజు గురించి అతని మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం..సింగర్ నాగరాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిత అనే యువతిని ప్రేమించానని, అయితే తమ వివాహానికి అనిత ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో విడిపోయామని తెలిపాడు.

ఆ బాధతోనే ‘అనిత ఓ అనిత’ పాటను రాశానని, ఈ సాంగ్ రాయడం కోసం నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు. తాను ఆ పాట రాయడానికి ముందు ఆర్కేస్ట్రాలో గాయకుడిగా చేసేవాడినని అన్నారు. తాను రాసిన మొదటి పాట ‘అనిత’ సాంగ్ ను తానే పాడినట్లు తెలిపారు.అప్పట్లో నేను మరణించానని రూమర్స్ కూడా వచ్చాయి. ఆ సమయంలో చాలా బాధ పడ్డానని తెలిపారు. అప్పుడు హైదరాబాద్‌ అంతా కొత్తగా అనిపించింది.

దాంతో భయపడి మా ఊరికి వెళ్లిపోయాను. అనితకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. నాకు దేవిక అనే అమ్మాయితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబుకి చెవిటి, మూగ. చిన్నబాబు కూడా పెద్దవాడిలానే సైగలే చేస్తాడని అన్నారు. కొంతకాలం పాటు పాన్‌షాపుతో నెట్టుకొచ్చానని, కళామతల్లి కాపాడుతుందని ఫ్యామిలీతో పాటు హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యామని తెలిపారు. ప్రస్తుతం తాను అనిత-2 పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply