Roja Daughter | స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్ చేయనున్న రోజా కూతురు..!

Roja Daughter | విత్తనం ఒకటి అయితే చెట్టు మరొకటి అవ్వదు కదా.. అన్షు మాలిక కూడా తన తల్లి రోజా హావ భావాలను, అందచందాలను, ప్రతిభ పట్టుదలను పుణికిపుచ్చుకుంది. అందుకే అన్షు మాలిక ఇప్పటికే కొన్ని అరుదైన గౌరవాలను సొంతం చేసుకుంది. ‘ఇన్ఫ్లూయెన్స్ యూకే మ్యాగజైన్’ కవర్ పై అన్షు మాలిక ఫోటోను కూడా ప్రచురించారు. అన్షు మాలిక గురించి ఎవరికి తెలియని విషయం ఏమిటంటే.. ఆమె రైటర్ గా, ప్రోగ్రామర్ గా, ఎంటర్ ప్రెన్యూర్ గా కూడా సత్తా చాటారు.

Roja Daughter

అందుకే.. పిన్న వయసులోనే యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక అయ్యి.. ఆ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అన్షు మాలిక చిన్న తనం నుంచి గొప్ప ప్రతిభను కనబరుస్తూనే ఉంది. ఆమె స్కూల్ నుంచి కాలేజీ వరకు తన క్లాస్ లో అన్షు మాలికనే ఫస్ట్. అందుకే ‘బర్న్ అచీవర్ మ్యాగజైన్’ కూడా అన్షు మాలిక గురించి రాస్తూ ‘ఆమె క్వీన్ ఆఫ్ టాలెంట్’ అని పేర్కొంది. పైగా తమ బుక్ కవర్ పేజీ పై ‘అన్షు మాలిక’ ఫుల్ ఫోటోను ఘనంగా ప్రచురించింది.

Roja Daughter
Roja Daughter

అది పక్కన పెడితే రోజా కూతురు అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని గత కొన్నిరోజులుగా న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయి. అన్షుమాలికకు అందంతో పాటు నటనపై ఆసక్తి ఉండటంతో టాలీవుడ్​లో ఆమె ఎంట్రీ త్వరలోనే ఉండనుందని అభిమానులు సంబురపడి పోతున్నారు.

Roja Daughter

Roja Daughter
Roja Daughter

అయితే తమిళ్ స్టార్ విక్రమ్ తనయుడు ధ్రువ ​తో అన్షు ఎంట్రీ ఇవ్వనున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. కోలీవుడ్ వర్గాల్లో ఈ వార్తలు వైరల్ అవుతుండటతో అన్షు తన ఫస్ట్ సినిమానే తెలుగు, తమిళం రెండు భాషల్లో తీస్తోందని రోజా అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. కానీ దీనిపై రోజా, అన్షుమాలిక, సెల్వరాజ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Leave a Reply